
కన్నడ డబ్బింగ్ సినిమా కాంతార రికార్డుల మోత మోగిస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసారు. కేవలం మూడున్నర కోట్లకు ఈ సినిమాను కొన్నాడు. ఇక నాలుగు రోజుల్లో 17 కోట్ల వసూళ్లను కేవలం తెలుగులోనే సాధించింది ఈ చిత్రం.
ఇక ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి అవలీలగా 150 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇటీవల కాలంలో కన్నడ సినిమాలు విజయదుందుభి మ్రోగిస్తున్నాయి. కేజీఎఫ్ చిత్రాలతో ఈ హవా మొదలైంది. విక్రాంత్ రాణా కూడా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడేమో కాంతార వచ్చింది.
ఇంతకీ ఈ రిషబ్ శెట్టి ఎవరో తెలుసా …… హీరోయిన్ రష్మిక మందన్న ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న హీరో. రష్మిక మందన్న – రిషబ్ శెట్టి ఇద్దరూ ఇష్టపడి వివాహ నిశ్చితార్థం కూడా భారీ ఎత్తున చేసుకున్నారు. ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో విబేధాలు వచ్చాయి. దాంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. రష్మిక పెద్ద హీరోయిన్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాంతార చిత్రంతో.