36.5 C
India
Friday, April 10, 2026
More

    ‘కాంతార’ వేరు…’ విరూపాక్ష’ వేరు..!

    Date:

    'Kanthara' is different... 'Virupaksha' is different..!
    ‘Kanthara’ is different… ‘Virupaksha’ is different..!

    సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష. ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ప్రమోషన్స్ లో తేజ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలో బైక్​ ప్రమాదం తనకు బాధంటే ఏంటో నేర్పిందని అంటూ మెగా హీరో ఎమోషనల్ అవుతున్నాడు.

    ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని చాలామంది అనుకున్నారు, “కానీ మా అమ్మ నాకు మళ్లీ మాటలు నేర్పించారు. నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. 36 ఏళ్ల వయసులో మళ్లీ నాకు మాటలు నేర్పించారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి భావోద్వేగానికి గురయ్యాడు. ఇక జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి గారు ఓ కొటేషన్ పంపించారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించారు’’ అని చెప్పుకొచ్చారు.

    ఇదిలా ఉంటే..ఈ సినిమాను ‘కాంతార’ తో పోల్చను.. పోల్చవద్దు… అది కల్ట్ క్లాసిక్ సినిమా. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు తేజు. ఇండియానా జోనస్ సినిమాలు నాకు చాలా ఇష్టం… హారర్ సినిమాలు చూడటం వేరు.. చేయడం వేరు. నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడిని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతానని చెప్పుకొచ్చారు. మొత్తానికి విరూపాక్ష ప్రమోషన్స్ లో తేజు.. సినిమా విషయాలతో పాటు… తన అనుభవాలను పంచుకుంటున్నారు. మరి తేజు నటించిన ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Accident : ప్రమాదం నుంచి బయట పడ్డ ఈ హీరో ఇప్పుడు సక్సెస్ బాటలో..

    Accident : ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మృత్యువు అంచుల...

    Mega Hero : మెగా ఇంట మళ్లీ పెళ్లి బాజాలు..! ఆ హీరోయిన్‌తో హీరో పెళ్లి ఫిక్స్..?

    Mega Hero :మెగా ఇంట్లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా? అంటే...