సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరిగా నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన కృష్ణ నవంబర్ 15 న గుండెపోటుతో మరణించడంతో పలువురు స్టార్ హీరోలు , దర్శక నిర్మాతలు కృష్ణ కు నివాళిగా ఈనెల 17 న షూటింగ్స్ ఒకరోజు బంద్ చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇక కృష్ణ పార్దీవ దేహాన్ని నానక్ రాం గూడ లోని ఇంటి నుండి ఈరోజు సాయంత్రం గచ్చిబౌలి లోని స్టేడియం కు మార్చనున్నారు. రేపు ఉదయం వరకు కూడా అభిమానుల సందర్శన కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం లో కృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరుగనున్నాయి.