రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈడీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయి ఇబ్బందులు పడుతుంటే ఆ బాధ సరిపోనట్లుగా ఈడీ కూడా రంగంలోకి ప్రశ్నల వర్షం కురిపించడంతో తీవ్ర షాక్ కు గురయ్యాడట. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్ దేవరకొండ ను రాత్రి 9 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించారట.
దాదాపు 9 గంటల పాటు ప్రశ్నలు వేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు ఈ రౌడీ హీరో. దాంతో బయటకు వచ్చిన తర్వాత మీరు చూపించే అభిమానంతో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉంటాయి ……. వాళ్ళు వాళ్ళ పని చేసారు …… నాకు తెలిసినవన్నీ చెప్పానని వెళ్ళిపోయాడు. అంతకుముందే దర్శకులు పూరీ జగన్నాథ్ , ఛార్మి లను విచారించింది ఈడీ.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన విషయం తెలిసిందే. ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమాకు పెట్టుబడులు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.