32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Bring that law : ఏంటి.. వైసీపీ ఆ చట్టం తేబోతుందా..?

    Date:

    • ఇక చంద్రబాబు పని అయినట్టేనా..
    bring that law
    bring that law, Chadra babu road show.

    bring that law : ఏపీలో రాజకీయాలు ఎప్పడు వేడి మీదే ఉంటాయి. టీడీపీ, వైసీపీ మధ్యలో జనసేన ఏదో చోట నిత్యం ఘర్షణలే. ఇక ఈ పార్టీల ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు పొద్దున లేస్తే మొదలెట్టే బూతుపురణం అంతా ఇంతా కాదు. వీరి మాటలు వింటుంటే అసలు రాజకీయాలు మరీ ఇంతలా దిగజారి పోయాయా అనిపిస్తుంది. దేశంలోనే అత్యంత ఎక్కువ నీచ రాజకీయాలు ఇక్కడే వినిపిస్తాయని చర్చ కూడా జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇది మరీ ఎక్కువైందనే వాదన వినిపిస్తున్నది. చంద్రబాబు లాంటి ఓ అగ్రనేతను కూడా ఏడిపించే స్థాయిలో వైసీపీ క్రూర రాజకీయ నడిచిందంటే ఇక ఏపీ భవిష్యత్ ఏంటో అర్థమవుతూనే ఉందని పక్క రాష్ర్టాల నేతలు చెబుుతున్నారు.

    చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా..

    అయితే ప్రతిపక్ష నేతలు సభలు మీటింగులు రోడ్లపై పెట్టకుండా ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ వన్ తెచ్చింది. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రతి పక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని న్యాయస్థానం అభిప్రాయ పడింది. వెంటనే జీవో ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఆయన రోడ్డెక్కకుండా మరో జీవో తెస్తామన్నారు. దీంతో అంతా విమర్శలు గుప్పిస్తున్నారు.

    వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయన పర్యటనలు ఉన్నచోట భారీకేడ్లు, పరదాలు కట్టడం లాంటి వి చేస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రజల్లోకి నేరుగా వెళ్తున్నారు. ఆయన పర్యటనలకు ఇటీవల జోష్ పెరుగుతూ వస్తున్నది. పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడం వలన జరిగిన ఘటనను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ను కట్టడి చేయాలని చూస్తున్నారు. అంటూ ఏపీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా వైసీపీ నేతల తీరు బాగా లేదని విమర్శిస్తున్నారు.
    సజ్జల కామెంట్స్ మాత్రం చంద్రబాబును కట్టడి చేయడానికి జగన్ ఏదో పెద్ద తతంగమే నడుపుతున్నారని అనిపిస్తున్నది. ఎన్నికలకు ఏడాది ముందు ఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తేనే వచ్చే ఎన్నికల్లో తమకు ఢోకా ఉండదని, లేదంటే ఈ సీనియర్ నేత తమను గెలవనీయడని భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అంత సీనియర్ నేత మరొకరు ప్రస్తుతం లేరు. వన్స్ మోర్ అంటూ అధికారంలో కి వచ్చిన జగన్ , తన నేతల తీరుతో ఎంతో వివాదస్పదుడయ్యారు. సో మరి ఏపీ ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారని జగన్ కు కొంత సమాచారం ఉండే ఉంటుంది. అందుకే ఈ కట్టడి ప్లాన్ మొదలు పెట్టారని టాక్.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...