40 C
India
Sunday, May 5, 2024
More

    Sr. NTR Centenary Celebrations : ఎన్టీఆర్ శతజయంత్యువాలకు అగ్రహీరోలు

    Date:

    • ఆహ్వానించిన టీడీపీ

    Top heroes of Sr. NTR centenary celebrations : తెలుగు ప్రజలు, సినిమా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. కోట్లాది అభివమానుల గుండెల్లో ఆయన ఇప్పటికే అన్నే. ఆయనో తారక మంత్రం. తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకస్థాయికి తీసుకెళ్లిన నటసార్వ భౌముడు ఆయన. ఆయనను ఆదర్శంగా తీసుకున్న ఎందరో తెలుగు సినీ జగతిలో అగ్రహీరోలుగా ఎదిగారు. ఇప్పటికీ ఆయన చేసిన పౌరాణిక పాత్రలు మరెవరికీ సాధ్యం కాలేదంటే ఆయనకు నటనపై ఉన్న ధ్యాస మరెవరికీ సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం

    పాతికేళ్లయినా..

    ఎన్టీఆర్ ఈ ప్రపంచాన్ని వీడి పాతికేళ్లయినా ఇంకా ఆయన చిరస్మరణీయుడిగా నే మిగిలిపోయారు. ప్రస్తుతం ఆయన శతజయంత్యుత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయన అభిమానులు, ఆయన పెట్టిన పార్టీ నాయకులు  శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ అభివృద్ధి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడిగా ఎన్టీఆర్ అంటే ఎందరికో అభిమానం. ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ఉత్తరాది అధిపత్యంపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. అటు సినిమాల్లోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. అందుకే ఎన్టీఆర్ అంటే స్పెషల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటి హీరోలకు ఇది సాధ్యమవుతుందా అంటే అది కలే.

    అయితే ఈ మహానేత శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో అతి పెద్ద వేడుకను ఈనెల 20న నిర్వహిచబోతున్నది. ఈ వేడకకు ఇప్పటికే అతిరథమహారథులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.  హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ , పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్,సహా మరికొందరు సినీ హీరోలకు ఈ వేడుకకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా వీరి ప్లెక్సీలను టీడీపీ ఏర్పాటు చేయించింది. టీడీపీ నేత టీడీ జనార్దన్ ఈ ఆహ్వానాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వేడుకకు ఎవరెవరు వస్తారు అనేది.. మరో రెండ్రోజుల్లో తేలనుంది. మరోవైపు అట్టహాసంగా శతజయంత్యుత్సవాలు నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tolly wood : రీమేక్ లతో చేతులు కాల్చుకుంటున్నారు.. ఇక టాలీవుడ్ తీరు మారదా?

    Tolly wood : తెలుగులో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది....

    Tollywood : ఏ లెక్కన చూసుకున్నా ఆ హీరోతో నిర్మాత సేఫ్

    Tollywood : టాలీవుడ్ లో ఒక్క హిట్ పడగానే హీరోలు తమ...

    TANA Mahasabha 2023 : తానా మహాసభలు జూలై 7 నుంచి 9 వరకు

    TANA Mahasabha 2023 : అమెరికాలో తానా మహాసభలు ఈనెల 7...

    NTR cover page : ఇంగ్లిష్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?!

    NTR cover page : యుగపురుషుడు నందమూరి తారక రామారావు గురించి...