27.5 C
India
Wednesday, May 8, 2024
More

    KCR Dream : కేసీఆర్ రూ. లక్ష అస్త్రం.. ఫలిస్తుందా..?

    Date:

    KCR Dream
    KCR Dream

    KCR Dream : హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు తెచ్చిన కేసీఆర్ ఆ తర్వాత గిరిజన బంధు అంటూ ప్రకటించారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ‘బీసీ బంధు‘కు ప్రణాళికలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. దళిత బంధు వచ్చిన సమయంలో బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే బీసీల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు కేసీఆర్. దీనిపై విస్తృతంగా కసరత్తు చేసి ఒక పథకానికి శ్రీకారం చూట్టారు ఆయన. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలనుఆర్థికంగా బలోపేతం చేయాలని అందుకు రూ. లక్ష ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.

    పథకం అమలు విధి, విధానాలపై మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సబ్ కమిటీలు విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేస్తుంది. ఈ సబ్ కమిటీ విధివిధానాలు దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా అమలు చేయాలని సీఎం నిర్ణయించినట్లు లీకులు వినిపిస్తున్నాయి. జూన్‌ 2 నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 21 రోజుల పాటు సాకే ఈ ఉత్సవాల్లో రూ. 2వందల కోట్ల వరకూ కేటాయించాలని అనుకుంటున్నారు. సచివాలంలో మొదటి రోజు వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్రం మొత్తం ఆయా కేంద్రాల పరిధుల్లో కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాల్లోనే రూ. లక్ష సాయంపై గులాబీ బాస్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

    దళిత బంధు సమయంలో దళితులకు ఎలాంటి అర్హత పెట్టలేదు. ప్రతీ దళితుడికి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ చాలా మంది దళితులకు ఇచ్చారు. కానీ బీసీ బంధు అలాకాదు. దానికి అర్హతలు ఉండాలని నిర్ణయించారట. అరకొరగా ఇస్తే అసంతృప్తి ఎక్కువవుతుంది. దళితులకు రూ. 10 లక్షలు ఇచ్చి, బీసీలకు లక్షేనా అంటూ వాదనాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొని బీసీ బంధును అమలు చేస్తామని కేసీఆర్ బలంగా చెప్తున్నట్లు వినిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...

    Rythu Bandhu Stop : రైతుబంధు వద్దు.. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేస్తున్న పెద్ద తప్పు ఇదే..!

    Rythu Bandhu Stop : తెలంగాణలో ఎన్నికలకు మరో 35 రోజుల...

    BRS Big Plan : ఎన్నికల వేళ బీఆర్ఎస్ భారీ ప్లాన్..!

    BRS Big Plan : ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను ప్రసన్నం...