40 C
India
Sunday, May 5, 2024
More

    Jagan meet BJP : బీజేపీ పెద్దలతో జగన్ భేటీ.. రాజకీయమా.. వ్యక్తిగతమా..?

    Date:

    Jagan meet BJP
    Jagan meet BJP

    Jagan meet BJP : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఎప్పుడూ వార్తలో నిలుస్తుంది. ఆయన రాష్ర్ట ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తుంటారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తుంటారు. అయితే నిజానికి జగన్ టూర్ ఎప్పుడూ రహస్యంగానే సాగుతుంది. ఆయన బీజేపీ పెద్దలను కలిసే సమయం కూడా ఇందుకు కారణమవుతుంటుంది. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాను ఏపీ సీఎం జగన్ ఎప్పుడూ రాత్రి పది తర్వాతే కలుస్తారని ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో కొనసాగుతున్నది.

    అయితే ఏపీ సీఎం జగన్ మెడకు ఎన్నో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వాటి ఊసే లేకున్నా పార్టీ ఎంపీ, సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంశం ఆయనకు తలనొప్పిలా మారింది. పార్టీ కి పెద్ద చేటు చేసే అవకాశం ఉన్నది. దీంతో పాటు ప్రస్తుతం రాష్ర్ట ఖజానాలో నిధుల కొరత వేధిస్తున్నది.  సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల జీతాలు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ కేంద్రానికి తలొగ్గక తప్పడం లేదు.

    ఇప్పటికే పోలవరాన్ని పణంగా పెట్టి రాష్ర్టానికి రూ. పది వేల కోట్లు తెచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జగన్ తాజా పర్యటన కూడా రాష్ర్ట ప్రయోజనాలకు కాకుండా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల మేరకే సాగిందని టీడీపీ, జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ తో పాటు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బీజేపీ పెద్దలు నరేంద్రమోదీ, అమిత్ షా తదితరులతో ఆయన భేటీ అయినట్లు సమాచారం.

    ఇటీవల కాలంలో పలుమార్లు మోదీ, అమిత్ షాలతో జగన్ సమావేశమయ్యారు. కానీ రాష్ర్టానికి తెచ్చిన మేలేంటో చెప్పాలని అంతా ప్రశ్నిస్తున్నా ఆయన మిన్నుకుండి పోయారు.  కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి, వ్యక్తిగత, రాజకీయ కోణంలోనే ఆయన పర్యటనలుంటున్నాయని ఆయన ప్రత్యర్థులు మండిపడుతున్నారు. వైసీపీకి ఇంతమంది ఎంపీలను రాష్ర్ట ప్రజలు ఇచ్చినా ఆయన ఏం సాధించలేకపోయారనే అపవాదు ఎలాగూ మూటగట్టుకున్నారు. విశాఖ రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఎలాగూ తేలేదని, విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా పోగొట్టి తన ప్రయోజనాలు చూసుకుంటున్నారని అంతా ఆరోపిస్తున్నారు. మరి జగన్ టూర్ల మర్మమెంటో ఆయనకే తెలియాలి.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....