31.3 C
India
Saturday, April 27, 2024
More

    Temperature in Vizag : వైజాగ్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత.. 11 ఏళ్లలో ఇదే రికార్డు

    Date:

    Temperature in Vizag
    Temperature in Vizag

    Temperature in Vizag : ఎండలు మండుతున్నాయి. వేడి సెగ పెరుగుతోంది. ఎన్నడు లేని విధంగా ఉష్ణోగ్రత విశాఖపట్నంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వాతావరణ సమతుల్యలు దెబ్బతినడానికి మన తప్పిదాలే కారణం. మనం చేస్తున్న పనులతో మన గమనం సందిగ్ధంలో పడుతోంది. దీంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. రోహిణి కార్తెలో ఎండలు కొట్టినా మృగశిరలో వర్షాలు పడాల్సి ఉన్నా ఇంతవరకు చుక్క కూడా పడలేదు. దీంతో రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.

    వైజాగ్ లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. గత పదకొండు ఏళ్లలో ఇంతటి ఉష్ణోగ్రత చూడలేదని భయపడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు కారణాలు మాత్రం తెలియడం లేదు. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై ఆందోళన నెలకొంటోంది.

    సోమవారం 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో వేడిని భరించే సత్తా కనిపించడం లేదు. వాతావరణ పరిస్థితులు మారడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు మూడు నాలుగు రోజుల్లో రాయలసీమ ప్రాంతాన్ని తాకుతుందని అంటున్నారు.

    ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికి కోస్తాపై ప్రభావం ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ మార్పులపై ఆందోళన నెలకొంది. ఎన్నడు లేని విధంగా ఎండలు ఇలా మండిపోవడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. వర్షాలు పడకపోతే ఇంకా వేడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Weather Alert : తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల అప్రమత్తంగా ఉండాలి..! 

    Weather Alert : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు...

    Hyderabad : హైదరాబాద్‌ వాసులకు అలెర్ట్

    Hyderabad : రాష్ట్రంలో ఆదివారం నుంచి గురువారం వరకు ఉష్ణోగ్రతలు పెరిగే...

    Telangana Weather : ఈ టైంలో అసలు బయటికి రాకండి..

    Telangana Weather :  రాష్ట్రంలో ఎండలు మండిపోతు న్నా యి. గత...