విజయవాడలో ధర్నా చౌక్ వద్ద తెల్లవారు జామున 3 గంటల సమయంలో అంగన్వాడీ మహిళలను పోలీ సులు అరెస్ట్ చేశారు. ముందుగా ధర్నా చౌక్ సమీపంలో లైట్లు అర్పేసి దీక్షా శిభిరం దగ్గరకు చేరుకోని మా పై దౌర్జన్యం చేశారని అంగన్వాడీలు ఆవేధన వ్యక్తం చేశారు. ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై డిసిపి విశాల్ గున్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ దృష్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్లను సైతం పోలీసులు బస్ ఎక్కించారు.
దీంతో ఫోటోగ్రాఫర్లు అంతా వాగ్వివాదానికి దిగడం తో పోలీసులు దింపే శారు. విజయవాడ చరిత్రలో మీడియా పై దౌర్జన్యం ఇదే తోలిసారి అని ఫోటోలు తీస్తే ఊరుకోనన్న డిసిపి విశాల్ గున్ని హెచ్చరించడం సరైన పధ్దతి కాదని జర్నలిస్టులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పేపర్లలో వస్తే బాగోదని హెచ్చరికలు జారీ చేయడం ఏంటి అని వారు వాపోతున్నారు. పోలీసులు బలవంతంగా మహి ళలను బస్సులో ఎక్కించారు. పోలీసులు సుమారు గా 20కి పైగా బస్సులను తీయనుకోచ్చి అరెస్టులు చేయడంతో ధర్నా చౌక్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి.