38.7 C
India
Wednesday, May 8, 2024
More

    Earthquake in Delhi : ఢిల్లీలో భూ ప్రకంపనలు.. వణికిన జనం

    Date:

    Earthquake in Delhi
    Earthquake in Delhi

    Earthquake in Delhi : ఓ వైపు పక్కనే ఉన్న నేపాల్ ను 6.4 తీవ్రతతో భారీ భూకంపం వణికించింది. ఇక ఆ తర్వాత శుక్రవారం రాత్రి మన ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. సుమారు 15 సెకన్ల పాటు వీటి తీవ్రత కనిపించింది. అయితే ప్రజలంతా ఆందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి రాత్రంతా భయాందోళనతో గడిపారు.

    ఇక శుక్రవారం అర్ధరాత్రి 11.32 గంటలకు ఢిల్లీ, ఢిల్లీ ఎన్సీఆర్, బిహార్. ఉత్తర ప్రదేశ్. మధ్య ప్రదేశ్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) స్పష్టం చేసింది. అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దదీని వల్ల ఎక్కడైనా నష్టం జరిగిందా అనే వివరాలు మాత్రం అధికారికంగా బయటకు వెల్లడి కాలేదు. అయితే అర్ధరాత్రికి తామంతా టీవీ చూస్తుండగా ఒక్క సారిగా భూప్రకంపనలు ఏర్పడినట్లు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి చెప్పారు. ఇక బిహార్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతుందో గుర్తించలేకపోయామని, కొంత సేపటికి తెరుకొని అప్రమత్తమయ్యామని ఓ మహిళ చెప్పుకొచ్చారు.

    అయితే నేపాల్ లో మాత్రం భూకంపం భారీ బీభత్సాన్ని సృష్టించినట్లు సమాచారం. అక్కడ 70 మంది వరకు మరణించినట్లు తెలుస్తున్నది. ఇంకా ఇండ్లు నేలమట్టమవడంతో చాలా మంది శిథిలాల మధ్య చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు, పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే మిలటరీ రంగంలోకి దిగి, సహాయక చర్యలను చేపడుతున్నది.

    Share post:

    More like this
    Related

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్.. సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్ లకు ఆలవాటుపడిన...

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. భయం తో పరుగులు తీసిన జనం..

    Earthquake in Japan : జపాన్ లో గురువారం ఉదయం భారీ భూకంపం...

    Earthquake : రాష్ట్రంలో 2 జిల్లాల్లో భూకంపం.. పరుగులు తీసిన జనం..

    Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి....

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...

    China-Delhi: చైనాలో పెను భూకంపం..ఢిల్లీలో భూప్రకంపనలు

                సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్...