- మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగం

DK Shiva kumar : కర్ణాటక ఎన్నికల్లో విజేతలెవరో తేలుతున్నది. ఇప్పటికే ప్రముఖులు విజయం సాధించారు. కొందరు ఓటమి పాలయ్యారు. ఫలితాలను బట్టి చూస్తుంటే మెజార్టీ ప్రజల తీర్పు కొత్త కోణాన్ని చూపిస్తున్నది. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారు కూడా ఓడిపోయారు. బళ్లారి లో శ్రీరాములు లాంటి వారు కూడా ఓడిపోవడం ఇక్కడ విస్మయానికి గురిచేస్తున్నది. గాలిజనార్దన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో తాను మినహా మిగతా 14 మంది ఓటమి పాలయ్యారు. ఎంఐఎం పార్టీ ఖాతా తెరవలేదు. మరోవైపు కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తుండడంతో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని సోనియా, రాహుల్ కు అంకితమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమకు ఫలితం దక్కిందని అభిప్రాయపడ్డారు. అయితే సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యానిదే కర్ణాటకలో విజయమని ప్రకటించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం కనిపించలేదని తెలిపారు.. 130 సీట్లు వస్తాయని ముందే చెప్పానని అదే ఇప్పుడు ఫలితంగా వస్తున్నదని పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ సపోర్ట్ మాత్రమే ఉందని, వ్యక్తుల మద్దతు లేదని తెలిపారు.
కనకపుర నుంచి డీకే శివకుమార్
వరుణ నుంచి సిద్ధరామయ్య
హోల్ నర్సిపూర్లో హెచ్డీ రేవణ్ణ
సొరబలో మధు బంగారప్ప
గంగావతిలో గాలి జనార్దన్ రెడ్డి
ఓడిన ప్రముఖులు..
నిఖిల్ కుమార్ స్వామి