Japan :
‘సముద్రం ఈదడం సులువు కానీ సంసారం ఈదడం కష్టం’ అని నానుడే ఉంది. వివాహం కాక ముందు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వారు వివాహం తర్వాత తక్కువ సమయంలోనే విడిపోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఆ తర్వాత ఇద్దరూ ఒంటరిగానే లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే ఒకరు ఉంటే బాగుండు అని అనిపించడం కామనే. అయితే మరొకరితో స్నేహం చేస్తే అది కూడా పెళ్లి వరకు దారి తీస్తుందని అనుకోవడం కూడా సహజమే. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సంస్థ అబ్బాయిలకు అమ్మాయిలను, అమ్మాయిలకు అబ్బాయిలను అద్దెకు ఇస్తుంది.
జపాన్ లో ఒక సంస్థ ఈ వినూత్న అద్దె పద్ధతిని తీసుకువచ్చాయి. తమ ఇష్టాన్ని బట్టి, తమ వయసును బట్టి అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సంస్థలో అందుబాటులో ఉంటారు. ఇక అద్దెకు కావాల్సిన వారు వచ్చి సెలక్ట్ చేసుకొని తీసుకెళ్లడమే తరువాయి. దీంతో ఒంటరిని అనే ఫీలింగ్ లేకుండా ఉంటారని సంస్థ భావించింది. బిజినెస్ కూడా చలా వర్కవుట్ అవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే సమయంలో అద్దెకు తీసుకెళ్లేవారికి, అద్దెకు వెళ్తున్న వారికి కొన్ని కండీషన్లను కూడా విధించింది సంస్థ.
ఆ దేశంలో ఈ సంస్థ ఒక పోర్టల్ తీసుకువచ్చింది. దీంతో దేశంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేని వారికి గంటల లెక్కన అద్దెకు ఇస్తామని ప్రకటించింది. ఎవరికైతే పార్ట్ నర్స్ లేరో వారు ఈ పోర్టల్ ద్వారా గంటల లెక్కన అద్దెకు పొందవచ్చు. దీని కోసం గంటకు రూ. 3వేలు (ఇండియా కరెన్సీ ప్రకారం) చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెకు తీసుకెళ్లిన వారికి ఎటువంటి ఖరీదైన కానుకలు, హామీలు లాంటివి ఇవ్వద్దని చెప్పింది. దీంతో పాటు మరిన్ని కండీషన్లను పెట్టింది సంస్థ ఈ విషయాలను షిహో అనే అద్దెకు వెళ్లే యువతి చెప్పింది.
అయితే ప్రస్తుతం పోర్టల్ బిజీగానే ఉందని.. వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తుందని ఆ దేశంలో టాక్ వినిపిస్తుంది. అక్కడైతే ఒకే గానీ అదే అద్దె ఇండియాలో పెడితే ఎలా ఉంటుందో కదా? అది మన ఊహకే అందదు మరి.