39.6 C
India
Monday, April 29, 2024
More

    CID Back Step : లోకేశ్ విషయంలో తగ్గిన ఏపీ సీఐడీ.. ఆధారాల్లేకపోవడమే కారణమా..?

    Date:

    AP CID Back Step in Lokesh case because of lack of evidence
    AP CID Back Step in Lokesh case because of lack of evidence

    CID Back Step :

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక తర్వాత టార్గెట్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంటూ వైసీపీ శ్రేణులు చెబుతూ వచ్చాయి. ఏపీ సీఐడీలో కూడా అదే దూకుడు కనిపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే లోకేశ్ కూడా ఒకడుగు ముందుకేసి, దేనికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు.

    ఇక నిజానికి లోకేశ్ అరెస్టు ప్రచారం నాటికి ఆయన పై ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇక తన తండ్రి అరెస్ట్ తర్వాత ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న లోకేశ్ పై సెటైర్లు మొదలు పెట్టింది వైసీపీ. సీఐడీకి భయపడే లోకేశ్ ఢిల్లీలో ఉంటున్నారంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను ఏ 14గా సీఐడీ గా చేర్చింది. ఇక స్కిల్, ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్ పేరు ప్రస్తావన లేదు. అయితే ఇప్పటికే లోకేశ్ పలు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కోర్టుల్లో దరఖాస్తు చేసుకున్నారు.

    అయితే ఇప్పటికిప్పడు లోకేశ్ పై ఎలాంటి ఆధారాలు సీఐడీ వద్ద లేవు. ఇదే నేపథ్యంలో సీఐడీ కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తు్న్నది. ఒకవేళ నారాలోకేశ్ న్యాయపరంగా పై చేయి సాధిస్తే మొదటికే ఇబ్బంది వస్తుందని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం లోకేశ్ వ్యవహారంలో దూకుడుగా వెళ్లాలని ఆదేశాలు వస్తున్నట్లు టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈనెల 10న లోకేశ్ విచారణకు హాజరుకావాలని సీఐడీ ఆదేశించినా, వారి వద్ద ఉన్న ఆధారాలు ఏంటనేది మాత్రం బయటకు వెల్లడించడం లేదు. మరి ఈ కేసు కూడా డొల్లేనని, కేవలం కక్ష సాధింపు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ ఆరోపణలు చేయిస్తున్నదని ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    Congress-BJP : కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి.. బీజేపీలో చేరిక

    Congress-BJP : లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Lokesh : ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : నారా లోకేశ్

    Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన...

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Nara Lokesh : టీడీపీ అధికాంలోకి రాగానే RMP లకు న్యాయం చేస్తాం.. నారా లోకేష్ 

    Nara Lokesh : యువగళం పాదయాత్రలో ఆర్ఎం పీలు ఎదుర్కొంటున్న సమస్యలను...