Vishwak Sen :
కథల ఎంపిక విషయంలో ఏ హీరోకు ఉండే స్టయిల్ ఆ హీరోకు ఉంటుంది. ఆ కథ తనకు సూట్ కాదని ఒకరు అనుకుంటేనే ఇండస్ట్రీకి మరో బెస్ట్ హీరో పరిచయం అవుతాడు. ఇదంతా సినీ ఇండస్ట్రీలో కామనే. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ ‘అతడు’ కథ చెప్పిన సమయంలో ఆయన నిద్రపోయాడు. కానీ అదే కథ మహేశ్ బాబుకు కెరీర్ లో బెస్ట్ గా నిలిపింది. ఇలాంటి ఘటనే రీసెంట్ గా ఇండస్ట్రీలో జరిగింది. ఒక హీరో వద్దనుకున్నాడు కాబట్టే మరో హీరోకు బ్రేక్ దొరికింది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ మా కథ.
రీసెంట్‌గా రిలీజైన బేబీ మూవీ ఎంత పెద్ద హిట్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి అంచనా లేకుండా కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్ తోనే వచ్చి దాదాపు రూ. 80 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ మూవీ. ప్రస్తుతం సినిమా యూనిట్ సక్సెస్ మీట్లను నిర్వహిస్తోంది. ఒక చోట ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డైరెక్టర్ రాజేశ్ మాట్లాడారు.
‘ఈ కథను ఒక హీరోకు చెప్పాలని వెళ్లినప్పుడు అలాంటి సినిమాలు నేను చేయను. ఇలాంటి కథతో వస్తే నా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వను వెళ్లిపొమ్మను అన్నాడు. ఆ మాట వినంగానే అనిపించింది. ఒక హీరోకు నా కథ ఉండడం కాదు, నా కథే కామన్ మ్యాన్ ను హీరోగా చేయాలని అనుకున్నా’ అన్నా రాజేశ్. సక్సెస్ మీట్ కు వచ్చిన అల్లు అర్జున్ కూడా సాయి రాజేశ్ స్పీచ్ విని అతన్ని సపోర్ట్ చేశాడు.
ఇది ఇలా ఉంటే.. ‘బేబీ’ని రిజెక్ట్ చేసిన హీరో ఎవరా? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. సినిమాను రిజెక్ట్ చేసింది విశ్వక్ సేన్ అని తెలిసింది. ఒక మూవీ ప్రమోషన్ కోసం చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన విశ్వక్ సేన్ దీనిపై స్పందించారు. ‘మేము ఎలాంటి సినిమా చేయాలో మాకు ఒక ఐడియా ఉంది. అలాంటప్పుడు స్టోరీ బాగున్నా కొన్ని కథలు కొందరికి సెట్ అవ్వవు. అలాంటప్పుడు విని రిజెక్ట్ చేసి వాళ్ల సమయం వేస్ట్ చేసి వారిని బాధ పెట్టేకంటే ముందుగానే రిజెక్ట్ చేస్తే మంచిదని’ విశ్వక్ చెప్పారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో తెలుగు డైరెక్టర్స్ గ్రూప్ లో ఫస్ట్ విషెస్ చెప్పింది నేనే అని చెప్పారు. దీంతో విశ్వక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.