39 C
India
Wednesday, May 8, 2024
More

    చంద్రబాబుకు భారీ షాక్

    Date:

    చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
    chandrababu

    2019 లో ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి టీడీపీ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇప్పటికే అధికారం కోల్పోయి నాలుదేళ్లు దాటింది. కాని తెలుగుదేశం పార్టీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కరెక్టేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయింది.

    అమరావతి భూకుంభకోణంతో పాటు ఇతర చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేసింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం కూడా దర్యాప్తు నిర్వహించింది. దీని సిఫార్సుల ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీన్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది.

    దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక దశలోనే సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుబట్టింది. అంత వేగంగా స్టే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని గతంలోనే ప్రశ్నించింది. ఇవాళ దానికి అనుగుణంగానే తీర్పు కూడా ప్రకటించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయడంతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రభుత్వం ఇక సిట్ విచారణను పరుగులు పెట్టించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : చంద్రబాబుకు 2019 గుర్తు చేసిన జగన్..!

    YS Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన మచిలీపట్నం...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...