36.9 C
India
Monday, May 6, 2024
More

    Chandrababu arrested : చంద్రబాబు అరెస్ట్ : రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్.. వైసీపీ కుట్రలు

    Date:

    Chandrababu arrested: టీడీపీ నేతలపై వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జరిగిన జరిగిన అవినీతి గురించి ఆయనను శుక్రవారం అరెస్టు చేయడం జరిగింది. దీంతో ఏసీబీ రిపోర్ట్ లో నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు కూడా చేర్చారు. వైసీపీ కుట్రను అందరు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా దొంగచాటుగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.

    చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్ కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీఐడీ జతపరచిన ఆధారాల్లో వాస్తవం లేదని అంటున్నారు. చంద్రబాబు తరఫున దేశంలోనే అత్యంత ప్రఖ్యాత న్యాయవాదిగా పేరుపొందిన సిద్ధార్థ లూథా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున కూడా వాదనలు విన్నారు. దీంతో కేసు ఎటు వెళ్తుందో తెలియడం లేదు.

    ప్రభుత్వం కావలనే దురుద్దేశ పూర్వకంగా కేసులు పెడుతోందని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాన్ని దెబ్బతీయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరుతుండగా ప్రభుత్వ న్యాయవాదులు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఇరువర్గాల వాదనలు బలంగా వినిపిస్తున్నారు. తమదే న్యాయమని చెబుతున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాదనల మధ్య ఎలాంటి ఫలితం వస్తుందో తెలియడం లేదు. చంద్రబాబును ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన కుమారుడు లోకేష్ ను కూడా టార్గెట్ చేసుకుంది. అందుకే లోకేష్ ను కూడా కేసులో ముద్దాయిగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ ను కూడా ఎలా బలి చేయాలనే ప్లాన్లు చేస్తున్నట్లు సమాచారం.

    లోకేష్ ను కూడా కేసులో ఇరికించి పార్టీకి మనుగడ లేకుండా చేయాలనేదే వైసీపీ కుట్రలాగా కనిపిస్తోంది. దీంతోనే కేసులో లోకేష్ ను కూడా పాత్రధారిగా చేయాలనేదే వైసీపీ దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.ఏసీబీని అడ్డుపెట్టుకుని ఇంతటి దుర్మార్గానికి తెగబడటం అందరిలో ఆగ్రహాన్ని పెంచుతోంది. లోకేష్ పై కేసులు మోపితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...