- ఇటు ప్రజలపై, అటు ప్రతిపక్షాలపై..
CM Jagan, Jagan Scheems
CM Jagan Pressing the Button : ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలులో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ తన నవరత్నాలకు పదును పెడుతున్నారు. ప్రజా క్షేత్రంలోనే ఉంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రోజుకో ప్రాంతంలో తన పర్యటనను నిర్వహిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తు్న్నారు. మంగళవారం కూడా ఆయన బాపట్ల జిల్లా నిజాం పట్నంలో ఆయన పర్యటించనున్నారు. మత్స్యకార భరోసా కింద మత్స్యకార కుటుంబాలను ఆదుకోనున్నారు. అయితే కొన్ని రోజులుగా జగన్ అన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని పథకాలను అమలు చేస్తున్నారు.
- ప్రజా సంక్షేమానికి బటన్
ప్రజా సంక్షేమ పథకాలను బటన్ నొక్కి ప్రారంభిస్తున్నారు ఏపీ సీఎం జగన్. మరోసారి పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నారు. ఇటీవల రైతుల మీద వరాల జల్లు కురిపించిన ఆయన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచారు. ఆడబిడ్డలకు కూడా అండగా నిలుస్తున్నారు. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలవడంలో భాగంగా ఆయన బటన్ నొక్కబోతున్నారు.
దుష్టచతుష్టయంపై కూడా..
మరో వైపు దుష్టచతుష్టయం అని జగన్ చెప్పే వారిపై కూడా కేసుల బటన్ నొక్కుతున్నాడు. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీరావును తిప్పలు పెడుతున్నాడు. మార్గదర్శి లావాదేవీలపై ప్రజల్లో అనుమానం రేకెత్తెలా సోదాలు జరిపించి, కోర్టుల వరకు తీసుకెళ్లాడు. రామోజీని ముద్దాయిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు రాజధానిలో ఇన్ సైడర్ అవినీతి అంటూ చంద్రబాబు పైకి సీఐడీని ఉసిగొల్పుతున్నాడు. విచారణకు రావాలని ఇప్పటికే చంద్రబాబుకు నోటీసులు పంపినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లను చేర్చి ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
పదే పదే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు పడుతున్నా రాష్ర్ట ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకు అనుకూలంగా లేని ప్రతిపక్ష నేతలను ఎన్నికల ముందు దెబ్బకొట్టేందుకే సీఐడీ బటన్ నొక్కుతున్నట్లు అంతా భావిస్తున్నారు. ప్రతిపక్షాల అంతు చూడడమే భాగంగా సీఐడీని వాడుకుంటున్నాడని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇటు ప్రజలపై సంక్షేమంతో, ప్రతిపక్షాలపై కేసులతో ఏపీ సీఎం జగన్ బటన్ నొక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది.