30.4 C
India
Tuesday, May 7, 2024
More

    Castely elections : కాస్ట్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. వదినా జాగ్రత్త అంటూ ట్రోల్స్..

    Date:

    Castely elections : దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. మరో ఐదు నెలల్లో ఐదు రాష్ర్టాల ఎన్నికలు ఉండడంతో పాటు ఏడాదిలో లోక్ సభతో పాటు పలు రాష్ర్టాల ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్దం చేసింది. ఇప్పటికే ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, విపక్షాలు క్షేత్రస్థాయిలో చెమటోడుస్తున్నాయి. అధికార పార్టీలు ఒకడుగు ముందుకేసి, ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. విపక్షాలు కూడా తాము గెలిస్తే అంతకుమించి చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇక నువ్వా నేనా సై అన్నట్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

    అయితే ఈ సారి ఎన్నికలు మరింత కాస్ట్లీ కాబోతున్నాయి. తెలంగాణ, ఏపీల్లో అయితే ఇది మరింత ఎక్కువ అయ్యే చాన్స్ ఉంది. తెలంగాణలో హుజూరాబాద్, దుబ్బాక, హుజూర్ నగర్ ఎన్నికల్లోనే కోట్లాది రూపాయలు వెదజల్లారు. ఇక ఇప్పుడు అసలు ఎన్నికలు. చాలా పార్టీలకు చావో రేవో తేల్చుకునే సమయం. గతంలో కంటే ఎక్కువ చెమటోడ్చాల్సిందే. అధికార పార్టీ ఒకడుగు ముందున్నా, విపక్షాలు తమ స్థాయికి మించి పరిగెత్తాల్సిందే. అర్థ, అంగ బలం ఉన్న అధికార పార్టీలను ఢీ కొట్టాలంటే ఆ స్థాయిలో కత్తులు నూరాల్సిందే. కత్తులు ఎందుకు అనుకుంటున్నారా… ఆలోచనలకు పదును పెట్టడానికి. అవును అధికార పార్టీల వ్యూహాలను తట్టుకునేలా ఎత్తులు వేస్తేనే ప్రతిపక్షాలు దీటు జవాబు ఇవ్వగలవు. అందుకే  ఇప్పటికే అస్ర్తాలను సిద్ధం చేసుకున్నాయి. అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ప్రతిపక్షాలకు ఉండదు. డేగ కళ్లతో నిఘా వాటిపై నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా ఒక్కోసారి ప్రతిపక్ష పార్టీల నాయకులతకు ఎదురవుతుంది. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు పలు కీలక నేతల పరిస్థితిని అలాగే చేశారు. రాష్ర్టం మొత్తం తిరగాలనుకున్నా, కనీసం వారి నియోజకవర్గం కూడా దాటకుండా చేసి కట్టడి చేశారు.

    అయితే ఈ సారి ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం వరదలై పారే అవకాశం ఉన్నది. గతంలో ఇచ్చిన వాటికే ఈసారి ధరల రెట్టింపయి మొత్తం గుంజారనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన కొన్ని గ్రామాల్లో తమకు డబ్బులు ఇవ్వలేదనే స్థానిక ప్రజలు ఆందోళన చేసిన సందర్భాలను మనం చూశాం. మరి ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రెండు తెలుగు రాష్ర్టాల్లో పుంజుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ బలంగా దూసుకొస్తున్నాయి. సర్వేలు ఎలా ఉన్నా ప్రజల మనస్సులో అదే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఓటుకు నోటు తప్పదు. అధికార పార్టీలు ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజల జేబుల్లోకి పైసలు చేరవేస్తున్నాయి. మరి ప్రతిపక్షం అంతకుమించి ఏదో చేయాల్సిందే. అధికార పార్టీ కూడా ప్రజలకు ఇచ్చాం కదా అని కూర్చోవడానికి ఏం ఉండదు. ఎన్నికల ముందు రోజు చేయి తడిపినోడిదే ఇక్కడ నడుస్తుంది. పైసలు  ఎవరిచ్చినా మాకే ఓటేయండి అని ప్రచారం చేసినా, జనం నాడిని నమ్మడానికి ఏం లేదు. ఈ రోజు గెలిచే అవకాశం ఉన్న నేత తెల్లారేసరికి లెక్కలు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సారి ఎన్నికలు కాస్ట్లీ కాబోతున్నాయి. ఇంటింటికీ అభ్యర్థి తన బలాన్ని చూపాల్సిందే.  అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక జోక్ ట్రోల్ అవుతున్నది. అదేంటంటే..

    ‘పోయినసారి  ఓటుకు 3వేలు ఇచ్చాడు..
    ఏట్లో ఇసుకంతా అమ్ముకుదొబ్బారూ…. వదినా
    అవును వొదినా…..ఈసారి ఏకంగా కేజీ బంగారం ఇస్తారంట…
    అంటే మన లివర్లు కిడ్నీ లు కాలేయం కూడా అమ్మేత్తాడేమో.. వదిన ..’..

     అదన్న మాట సంగతి. నేతలు పైసలు ఇస్తున్నారు కదా .. అని తీసుకుంటే మన చేయి మన నెత్తి పైనే పెడుతారు. ఇప్పటికే సామాన్యుడు బతికే పరిస్థితిలేదు. ధరలు మండుతున్నాయి. దోపిడీ పెరిగింది. అడిగేవాడు లేడు కదా అని అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ప్రశ్నించాల్సిన మేధావులు  మెతకవైఖరి అవలంబిస్తున్నారు. ప్రశ్నించినోడిపై కేసుల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపార్టీ.. ఆ పార్టీ అని తేడా లేదు. ఎన్నికల ముందు అయ్యా.. అవ్వా అన్నోడు… గెలిచాక.. అరేయ్.. తురేయ్ అంటున్నాడు. ఇదే కదా నేటి రాజకీయం. సో.. ఓటుకు నోటు మీకు భవిష్యత్లో తూటు అంతే.. వదినా జాగ్రత్త మరి. కేజీ బంగారం.. కక్కేదాకా తొక్కేయడానికే.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Times Now-ETG survey : 2024లో ఏపీ, తెలంగాణ, కేంద్రంలో గెలుపు వీరిదే

    2024 Elections Times Now-ETG survey: అదే పాత ఛానెల్, అదే పాత...

    CM Jagan : ఎన్నికలపై వైసీపీ నజర్.. వైనాట్ 175 అంటున్న జగన్

    CM Jagan : ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అధికార వైసీపీ...

    People of AP : తప్పు తెలుసుకున్న ఏపీ ప్రజలు.. ఇక 2024 లో వారి వైపే..

    People of AP : చంద్రబాబు అరెస్టుతో వైసీపీ నాయకులు, ముఖ్యంగా సీఎం...

    Jana Sena & TDP : ఇప్పుడు పొలిటికల్ గేమ్ జనసేన చేతిలో..టీడీపీ తలొగ్గక తప్పని పరిస్థితి..?

    Jana Sena & TDP : రాజకీయాల్లో పవన్ కల్యాణ్ స్టాండ్ సరిగా...