Siddham Sabha : బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృ ష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసా యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఒక గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి వెళ్తున్న క్రమం లో అతను అస్వస్థతకు గురై మృతిచెం దినట్లు పోలీసులు తెలిపారు.బస్సు నుండి జారిపడిన పల్నాడు కు చెందిన మరో వ్యక్తి మరణించాడు.
జగన్ సభకు కొన్ని లక్షల మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ క్రౌడ్ ఎక్కువ గా కావడం తో ఒక్కసారిగా జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.