Hanuman : మనలో చాలా మంది హనుమాన్ ను నమ్ముతారు. ధైర్యం కోసం ఆంజనేయుడుని పూజిస్తాం. ఎలాంటి చెడు మనపై పడకూడదని భావిస్తుంటాం. ఇందులో భాగంగానే మన ఇంట్లో కచ్చితంగా మారుతి బొమ్మ పెట్టుకోవడం సహజం. ఈ నేపథ్యంలో హనుమంతుడి బలం ముందు ఏ దుష్టశక్తి అయినా బలాదూరే అని తెలుసు. అందుకే మనం ఆంజనేయుడిని పూజిస్తుంటాం. రోజు కొలుస్తుంటాం.
హనుమాన్ ను ఉగ్రరూపంగా చూచించాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ఓ యువకుడు స్టిక్కర్ తయారు చేశాడు. దీంతో అది దేశవ్యాప్తంగా అందరికి ఇష్టంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ అతడిని ప్రశంసించడం గమనార్హం. కొన్ని కంపెనీలు కూడా అది తమకు ఇవ్వాలని ఎంత డబ్బు అయినా చెల్లిస్తామని చెప్పినా అతడు దాన్ని అమ్ముకోలేదు. తాను రూపొందించిన స్టిక్కర్ ఇంత ఆదరాభిమానాలు పొందడం గమనార్హం.
చాలా మంది దీన్ని వాడుకుంటున్నారు. దీంతో ప్రజల కోసం దాన్ని తయారు చేశానని అతడు చెబుతున్నాడు. వాహనాలపై తాను రూపొందించిన చిత్రాలు ఉండటం వల్ల తనకు ఎంతో గౌరవంగా ఉందని చెబుతున్నాడు. హనుమంతుడే తనతో ఆ బొమ్మ వేయించాడని అంటున్నాడు. దీనికి అరగంట కంటే తక్కువ సమయమే తీసుకున్నానని పేర్కొన్నాడు.
మనకు దైవభక్తి ఉండాలే కానీ ఏదైనా అలాగే కనిపిస్తుంది. అతడు కూడా ఏదో సరదాగా వేసిన బొమ్మ ఇంతలా ప్రాచుర్యం పొందుతుందని అనుకోలేదట. దీనిపై వాహనాలపై స్టిక్టర్లు అంటించడం వల్ల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్టిక్కర్ల వాడకం అంతకంతకు పెరుగుతోంది. ఇలా హనుమాన్ స్టిక్కర్లు వాడటం వల్ల అతడికి ఎంతో ప్రచారం తెచ్చింది.