horoscope today 30-7-2023 మేష రాశి వారికి అనవసర విషయాల పట్ల శ్రద్ధ చూపకండి. మనో నిబ్బరం కోల్పోకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన చేయడం మంచిది.
వ్రషభ రాశి వారికి పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. మనో విచారం కలిగే సూచనలున్నాయి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారికి అనుకూల కాలం. బాధ్యతల నిర్వహణలో మంచి ఫలితాలున్నాయి. శంకరుడిని ధ్యానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు రావడం ఖాయం.
కర్కాటక రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నచ్చిన వారితో గడుపుతారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. నారాయణ మంత్రం జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. విజయం సాధించడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర ఆరాధన చాలా మంచిది.
కన్య రాశి వారికి మంచి కాలం. మీ పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి మీ పనితీరుకు తగిన గుర్తింపు ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
వ్రశ్చిక రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా బలంగా ఉంటారు. బంధువులతో జాగ్ర్తత్తగా వ్యవహరించాలి. శని శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభ వార్త సంతోషాన్ని నింపుతుంది. ఇష్ట దైవాన్ని కొలవడం మంచిది.
మకర రాశి వారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు విలువ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలుంటాయి. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మంచి జరుగుతుంది.
కుంభ రాశి వారికి మంచి కాలం. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మధుర జ్ణాపకాలు నెమరు వేసుకుంటారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
మీన రాశి వారికి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సూర్యారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి.