30.6 C
India
Tuesday, April 30, 2024
More

    CM Revanth : జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని.. కేసీఆర్ కు సీఎం వార్నింగ్

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టో విడుదల చేసింది. తెలంగాణ మాదిరి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. దీని కోసమే ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం పూరించింది. ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టినా అందులో తగినన్ని పార్టీలు కలవడం లేదు. దీంతో వారి ఆశలు అడియాశలే అంటున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తంత్రాలు పన్నినా చివరకు విజయం ఎన్డీయేదే అవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

    పదేళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడతామని కాంగ్రెస్ చెబుతున్నా అదంత సులభం కాదు. మోదీ చరిష్మా ముందు వారి ఆశలు పనిచేయవు. పదేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

    కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎలా పడితే అలా మాట్లాడితే మాకు కూడా నోరుంది. మేం కూడా బూతులు మాట్లాడతాం. మా వంద రోజుల పాలన నచ్చడంతో రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

    గతంలో కూడా తుక్కుగూడ వేదికగానే ఆరు గ్యారంటీల హామీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచే యావత్ దేశం కోసం మేనిఫెస్టో ప్రకటించాం. ఇదే సెంటిమెంట్ తో విజయం సాధిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు కోసం కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం, విద్యుత్ సంక్షోభాన్ని మిగిల్చింది. దీంతోనే రాష్ట్రం దివాళా తీసింది. ఇప్పుడు మేం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం.

    ఈనేపథ్యంలో తుక్కుగూడలో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ దేశంలో అధికారం హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. కానీ వారి కోరికలు తీరే మార్గాలు కనిపించడం లేదని చెబుతున్నారు. వారు ఎన్ని మేనిఫెస్టోలు విడుదల చేసినా కాంగ్రెస్ కు ప్రతిపక్ష పాత్రే మిగులుతుందని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....