19.8 C
India
Sunday, February 25, 2024
More

  T20 World Cup : టి-20 వరల్డ్ కప్ లో ఇండియా మ్యాచ్ లివే..పాకిస్తాన్ కు మళ్లీ మూడినట్టే..

  Date:

  T-20 World Cup
  T-20 World Cup 2024

  T-20 World Cup : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కప్ పరాజయాన్ని మరిచి 2024లో మరో పెద్ద క్రికెట్ సంబరానికి మన ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఘన విజయాలు సాధించడమే లక్ష్యంగా వారు ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతానికి దక్షిణ ఆఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా.. ఆ తర్వాత వరుసగా ఇంగ్లాండ్ తో 5 టెస్టులు ఆడనుంది. ఇక ఐపీఎల్ వల్ల ఏప్రిల్, మే నెలల్లో అంతర్జాతీయ మ్యాచ్ లకు విరామం ఉంటుంది. మన ఆటగాళ్లు దాదాపు అందరూ ఈ టోర్నిలో ఆడుతారు. ఇక జూన్ లో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూసే టీ-20 ప్రపంచ కప్ వెస్టండీస్, యూఎస్ఏలో జరుగనుంది.

  అయితే టీ-20వరల్డ్ కప్ లో భారత్ తన సత్తా చాటుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వన్డే ప్రపంచ కప్ కోల్పోయినా పొట్టి కప్ మాత్రం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక క్రికెట్ అభిమానులకు మాత్రం ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పాటు సంబరాలు కొనసాగుతాయనే చెప్పవచ్చు. దాదాపు వంద రోజుల పాటు ఐపీఎల్, పొట్టి ప్రపంచకప్ సాగనున్నాయి. దీనికి ఆటగాళ్లు ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయారు. పొట్టి కప్ ఆటల్లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుందో ఇప్పుడే విశ్లేషణలు మొదలైపోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోతాడని, అతడే మ్యాన్ ఆఫ్ సిరీస్ గా నిలుస్తాడని సైతం పలువురు ట్వీట్ చేస్తున్నారు. రాబోయే ఐపీఎల్, టీ-20 వరల్డ్ కప్ అంతా ‘స్కై ’దేనని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

  కాగా, టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ ల షెడ్యూల్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. జూన్ 4 నుంచి 30వరకు మ్యాచ్ లు జరుగుతాయి. 20 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి తలపడుతాయి. తాజాగా ఇండియా ఆడే మ్యాచ్ లు ఆడే తేదీలు, జట్ల వివరాలు ఇవేనంటూ ‘స్పోర్ట్స్ టాక్’ ఓ లిస్ట్ విడుదల చేసింది. లీగ్ దశలో జూన్ 5న ఐర్లాండ్, 9న పాకిస్తాన్, 12న యూఎస్ఏ, 15న కెనడా జట్లతో భారత్ మ్యాచ్ లు ఆడుతుందట. అయితే ఐసీసీ ఇప్పటివరకు వీటిపై అధికారిక పర్యటన చేయలేదు. ఇవే డేట్లు ఉంటాయా? ఇంకా ఇతర జట్ల వివరాలు.. లాంటివి అన్నీ తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Tanya Singh Suicide : తన్యా సింగ్ సూసైడ్.. ఐపీఎల్ క్రికెటర్ ను విచారించిన పోలీసులు

  Tanya Singh Suicide : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెటర్...

  David Warner : వార్నర్ చేసిన పనికి వావ్ అనాల్సిందే..తన ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ట్రోఫీ ఏం చేశాడంటే..

  David Warner : పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ...

  Imran khan : పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులదే గెలుపు

  Imran khan : పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది....

  U-19 World Cup 2024 : కప్ తో పాటు వారి ప్రేమను కూడా గెలిచారు

  U-19 World Cup 2024 : వన్డే వరల్డ్ కప్ మనకు...