30 C
India
Thursday, May 9, 2024
More

    Bhagwant Kesari : ఆడ బిడ్డల తల్లులకు ఆ పాఠం చెప్పిన భగవంత్ కేసరి.. 

    Date:

    Bhagwant Kesari
    Bhagwant Kesari

    Bhagwant Kesari : దసరా కానుకగా వచ్చిన ‘భగవంత్ కేసరి’కి ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. కేవలం వినోదం కోసమే కాకుండా సమాజానికి చైతన్యం కలిగించే అంశాలతో మేలవించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇందులో కన్నడ నటి శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలో బ్యాడ్, గుడ్ టచ్ గురించి చిన్నారుల తల్లిదండ్రులకు బాలకృష్ణ అవగాహన కల్పించే సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

    స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఒక ఐదేళ్ల చిన్నారిని బాలకృష్ణ ‘పాపా.. నీకు వాడు చాక్లెట్ ఇచ్చి మీద చేతులేస్తుంటే తప్పని తెలియదా?’ అడుగుతాడు. ‘ఊహూ..’ అంటూ చిన్నారి అమాయకంగా చెప్తుంది.

    అలా చేతులు వేయడం తప్పని ఎవరైనా చిన్నారులకు చెప్తేనే కదా తెలిసేది. అది ఎవరు చెప్పాలి.. ఇంట్లో అమ్మా.. లేదంటే స్కూల్ లో లేడీ టీచర్.. కానీ వారు పట్టించుకోవడం లేదు. బయటి వారు కొందరు చెప్పాలని అనుకున్నా.. ఎలా చెప్పాలన్న సంశయంతో ఆగిపోతారు.  దీంతో చాలా మంది చిన్నారులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహనే లేకుండా పోతోంది.

    ఆ పాపను ఎత్తుకొని వారి స్కూల్ కు వెళ్తాడు భగవంత్ కేసరి. అక్కడి టీచర్లు ఎప్పడూ చెప్పని, కనీసం స్ప్రుషించని అంశం ‘బ్యాడ్ టచ్’ గురించి వివరంగా చెప్పాడు భగవంత్ కేసరి. ఇక సినిమా చూసిన ప్రతీ తల్లి, స్కూల్ టీచర్స్ కు భగవంత్ కేసరి గుడ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పారన్నమాట.

    ఇంట్లో సోదరులు, తాతల నుంచి బయట ఉన్న మగవాళ్ల వరకు ఎవరైనా వేయకూడని చోట చేయి వేస్తే వెంటనే వెళ్లి అమ్మకు చెప్పాలి. అమ్మనే మిమ్ములను కాపాడుతుంది. అలాగే అమ్మలకు కూడా ఓ మాట చెప్పాడు భగవంత్ కేసరి. ‘అడవిలో క్రూర మృగాలు తిరుగుతాయి. అడవి లోకి అవి సంచరిస్తున్న ప్రదేశాల్లో బోర్డులు పెడతారు. కానీ సమాజాంలో తిరుగుతున్న మానవ మృగాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎవరు బోర్డులు పెట్టాలి.. ఆ బాధ్యతను తల్లి, స్కూల్ టీచర్ పిల్లలకు నేర్పాలి’. అని భగవంత్ వారికి వివరించారు.

    కమర్షియల్ మూవీ పైగా స్టార్ హీరో సినిమాలో ఈ అంశాన్ని వివరించడంతో అనిల్ రావిపూడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Victory Venkatesh : అనిల్ రావిపూడితో విక్టరీ వెంకటేశ్ తర్వాత ప్రాజెక్ట్..

    Victory Venkatesh : వెంకటేష్ దగ్గుబాటి తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు...

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని...