Maldives : మాల్దీవులు, భారత్ కు గతంలో మంచి అవినాభావ సంబంధాలు ఉండేవి. కానీ ప్రధానిగా మొయిజు ఎప్పుడైతే ఎన్నికయ్యాడో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ కు శత్రుదేశం అయిన చైనాకు వంత పాడుతూ ‘పాలిచ్చే ఆవును కాదనుకొని పనికి రాని దున్నపోతు’ పక్కన చేరింది. పైపెచ్చు ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
మాల్దీవులను శత్రువులు ఆక్రమించుకోవాలని చూసిన సందర్భంలో భారత్ ను శరణు కోరింది. కోరిందే తడువుగా భారత్ ఆదుకుంది. శత్రుమూకలను అక్కడి నుంచి పంపించి వారికి అన్ని తామై చూసుకుంది. విద్య నుంచి వైద్యం వరకు చాలా విషయాలలో భారత ఆర్మీ అక్కడి వారిని ఆదుకుంటూ వస్తుంది.
మల్దీవులు అనేది దీవుల సమూహం కాబట్టి అక్కడ వైద్యం చాలా ఇబ్బందితో కూడింది. ఒక ద్వీపంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యం కోసం మరో రాజధాని అయిన మరో ద్వీపానికి తీసుకెళ్లాలి. దీని కోసం భారత వైమానిక దళంకు సంబంధించి విమానాలు ఉపయోగపడేవి. అక్కడ తాగునీటి కష్టాల సమయంలో విమానాల ద్వారా భారత్ తాగునీటిని పంపించింది. ఇలా చాల సందర్భాల్లో ఆ దీవులను ఆదుకుంది భారత్
కానీ మొయిజు ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ ను కాదని చైనాను అక్కున చేర్చుకునేందుకు వెళ్లాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ అందాలపై ఒక వీడియో చేయగా మాల్దీవుల మంత్రులను విమర్శలు చేశారు. దీంతో ఇండియా బైకాట్ మాల్దీవ్స్ స్లోగన్ అందుకుంది. ఇంకేముంది చిన్న ద్వీపం ఆర్థికంగా కుప్ప కూలిపోయింది. ఇప్పుడు అడుక్కునే పరిస్థితికి చేరుకుంది.
మాల్దీవ్ సెలబ్రెటీ హసన్ ఖురేషి ఇటీవల ఒక పోస్ట్ చేశాడు. ప్రతీ ఇండియన్ తమను ఆదుకోవాలని అందుకు ఒక్కొక్కరూ ఒక యూఎస్ డాలర్ ను విరాళంగా అందించాలని కోరాడు. దీన్ని ప్రపంచం రెండు విధాలుగా చూస్తోంది. 1. భారత్ ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని. 2. భారత్ ను సాయం అడిగాం కానీ ఇవ్వలేదని చెప్పేందుకు. అయినా భారత్ రీసెంట్ గా పెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్ లో మాల్దీవులకు కూడా నిధులు కేటాయించింది. అయినా ఆదేశం అడుక్కుతీనే స్థాయికి దిగజారిపోయింది. కోరితే భారత్ అన్నం పెడుతుంది. అదే వ్యతిరేకిస్తే వారిని వదిలేస్తుంది.. ఒక్క సారి వదిలితే ఆదేశం అధోగతికి చేరుకుంటుందని పొరుగున ఉన్న పాకిస్తాన్ తోపాటు ఇప్పుడు మాల్దీవులకు కూడా తెలిసిపోయింది.