32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Congress Bjp : కాంగ్రెస్ ఖాతాలో మరో రాష్ట్రాల .. ఆ సర్వే తేల్చిందదే..!

    Date:

    Congress Bjp : రానున్న ఆరు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది . ఇప్పటికే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువు తేదీలను ప్రకటించింది. అయితే ఇది ఆయా రాష్ట్రాలల్లో గెలుపు కోసం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే ఈ షెడ్యూల్లో నే  మధ్య ప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

    ప్రముఖ సంస్థ సీ డైలీ ట్రాకర్ ఇటీవల మధ్య ప్రదేశ్లో సర్వే చేపట్టింది. ఈ రాష్ర్టంలో ఈసారి కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని తేల్చింది.  ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని సర్కారు అధికారంలో ఉంది.అయితే సీ డైలీ ట్రాకర్ సంస్థ రాష్ర్టంలోని 230 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. తాజాగా ట్విట్టర్ ద్వారా ఫలితాలను వెల్లడించింది. అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేల్చింది. ఇప్పటికైనా ప్రజలకు అనుగుణంగా పని చేయకపోతే కష్టమేనని తెలిపింది. అధికార బీజేపీ 78 నుంచి 85 సీట్లు వస్తాయని,కాంగ్రెస్ కు 135 నుంచి 143, ఇతరులకు 8 నుంచి 12 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ భారీ విజయం ఖాయమని ఈ సర్వే తేల్చింది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ లో ఏర్పడబోయేది తమ ప్రభుత్వమేనని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇక తమ టార్గెట్ తెలంగాణ అని తెలిపారు. అయితే మధ్య ప్రదేశ్ లో ఈ సారి కాంగ్రెస్ నుంచి కమల్ నాథ్ ముఖ్యమంత్రి అవుతారని టాక్ నడుస్తున్నది.

    కర్ణాటక ఎన్నికల్లో ఇటీవల బీజేపీ భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. స్వయంగా ప్రధాని మోదీనే అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. పార్టీ లో ట్రబుుల్ షూటర్ గా పేరున్న అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇలా అందరూ కలిసి కర్ణాటకలో పాగా వేసినా, ఫలితం దక్కలేదు. అయితే కొంత కాలంగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం జరుగుతున్నది. దీనిని నిజం చేస్తూ బీజేపీ అపజయాలను మూటగట్టుకుంటున్నది. కేవలం మత రాజకీయాలకే బీజేపీ పరిమితమైందని దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతున్నది. అభివృద్ధిలో దేశాన్ని విస్మరించిందనే చర్చ నడుస్తున్నది. ఇవే ఫలితాలు ఇప్పుడు ఎన్నికల్లో వస్తున్నాయని అంతా భావిస్తున్నారు. అయితే కర్నాటక ఓటమి తర్వాత బీజేపీ కూడా మధ్య ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    CS Jawahar Reddy : ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు.. సి.ఎస్ జవహర్ రెడ్డి

    CS Jawahar Reddy : త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని...

    Elections Notification : నేడే ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల..

    Elections Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి...