33.1 C
India
Sunday, April 28, 2024
More

    Revanth Reddy : మోడీతో భేటీ తర్వాత.. మీడియా మీట్ లో రేవంత్ మౌనం.. ఎందుకంటే?

    Date:

    Revanth Reddy
    Revanth Reddy

    Revanth Reddy : మంగళవారం (డిసెంబర్ 26)వ తేదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, 14, 15 ఆర్థిక సంఘం నిధులపై చర్చిస్తారని తీవ్రంగా ప్రచారం జరిగింది. అయితే పీఎంతో భేటీ అయితే అయ్యారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం. ఆ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడే విషయంలో మౌనంగా ఉండిపోగా.. భట్టి విక్రమార్క మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అసలు ఏం జరిగింది.

    మంగళవారం జరిగిన భేటీ గంటకు పైగా కొనసాగింది. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసే వెళ్లడం భేటీలో పాల్గొనడం.. కలిసే బయటకు రావడం ఒక ఎత్తయితే.. బయటకు వచ్చి తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం మీడియా మీట్ మరో ఎత్తు. సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఎందుకిలా? పీఎంతో భేటీ సందర్భంగా ఎం జరిగిందన్న విషయాలను మీడియాకు వివరించే సమయంలో సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్నింటికి భట్టినే సమాధానం ఇవ్వడం వెనుక కారణం ఏంటి. అన్నది సందేహంగా మారింది.

    ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏదీ లేదంట. అయితే సీఎం రేవంత్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఢిల్లీ పర్యటన కూడా ఒక దశలో ఉంటుందా? క్యాన్సిల్ చేసుకుంటాడా? అన్న సందేహం కలుగింది. అయితే ఆయనకు విపరీతంగా జ్వరం వచ్చిందట. ఈ జ్వరంలోనే గొంతు ఇన్ఫెక్షన్ అయ్యిందట. వైద్యుల సూచనతో ఎక్కువగా మాట్లాడడం లేదు. ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టిగా మాట్లాడే అవకాశాలు, మీడియా మీట్లకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆయన వారి మాటలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ కారణంగానే ఢిల్లీలో మీడియాతో మాట్లాడే సమయంలో రేవంత్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం గట్టిగా మాట్లాడితే ఇబ్బందులు ఎదురవుతాయని.. నాలుగు లేదంటే ఐదు రోజులు గట్టిగా మాట్లాడకుంటే తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో.. తాను మాట్లాడకుండా భట్టీని మాట్లాడమని కోరినట్లుగా తెలుస్తోంది. పైగా ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గొంతు ఇన్ఫెక్షన్ మరింత పెరిగే వీలు ఉండవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు రేవంత్ కు సూచనలిస్తున్నట్లు పీఎం కార్యాలయం పేర్కొంటుంది. ప్రధానితో మాట్లాడే సమయంలో గట్టిగా మాట్లాడడం అవసరం లేదు. ఏది ఏమైనా.. రేవంత్ అనారోగ్య పరిస్థితులు భట్టీకి వరంగా మారిందని, ఢిల్లీలో ఆయన ప్రాధాన్యత పెరిగిందని పలువురు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....