Telangana congress: తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు పెడచూపాయి. గతంలో సీనియర్ల మధ్య ఉన్న విభేదాలు కొంతకాలంగా అధిష్టానం ఆదేశాలతో సద్దుమణిగినట్లు కనిపించినా మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తున్నది. అయితే ఈసారి వైఎస్సార్ కూతురు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ను పార్టీలోకి తీసుకోవడం అంశంపై రెండు వర్గాలు కాంగ్రెస్ చీలిపోయినట్లు కనిపిస్తున్నది. అయితే షర్మిలను పార్టీలో చేర్చుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నా ఆమె సేవలను కేవలం ఏపీకే పరిమితం చేయాలని ఓ వర్గం కోరుతున్నది.
అయితే కొంతకాలం షర్మిల కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. దీనికి అనుగుణంగానే ఆమె కే పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో పాటు ఏకంగా రాహుల్ గాంధీ కూడా వైఎస్సార్ కు అనుకూలంగా ఇటీవల ట్వీట్ చేశారు. తెరవెనుక డీకే తో పాటు కోమటి రెడ్డిలాంటి నాయకులు షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిని రేవంత్ రెడ్డి కొంత వ్యతిరేకిస్తున్నది. షర్మిలను కేవలం ఏపీకే పరిమితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ లో ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వొద్దని కోరుతున్నారు. అయితే కోమటి రెడ్డి నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఆమె చేరితే తప్పేంటని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సఖ్యంగానే ఉంటున్నారు. గతంలో ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కోమటి రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సమయంలో షర్మిల అంశం వీరి మధ్య మళ్లీ అగ్గి రాజేసిందని శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే షర్మిల రాకను అందరూ ఆహ్వానించాలని కోమటిరెడ్డి శ్రేణులకు తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారని, ఆమెను టీ కాంగ్రెస్ లోకి తీసుకుంటే మేలు జరుగుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి సహా మరికొందరు మాత్రం షర్మిల పార్టీలో చేరితే తమకేమి ఇబ్బంది లేదని, కానీ ఆమె సేవలు ఏపీలో అందించాలని బహిరంగంగానే చెబుతున్నారు. ఏదేమైనా షర్మిల వ్యవహారం టీ కాంగ్రెస్ లో మరో నిప్పు రాజేయబోతున్నట్లు కనిపిస్తున్నది.
ReplyForward
|