31.4 C
India
Sunday, April 28, 2024
More

    TDP & Jana Sena Alliance : క్లీన్ స్వీప్ పక్కా.. ఎన్నికలే తరువాయి.. టీడీపీ -జనసేన పొత్తుపై పందేలు..

    Date:

    TDP & Jana Sena Alliance :
    2024లో టీడీపీతో కలిసే ముందుకు సాగుతామని ఎప్పుడైతే పవన్ కల్యాన్ ప్రకటించాడో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ఇక అధికార పార్టీ వైసీపీ మూట సర్దుకోక తప్పదంటూ ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌కు తరలించడంతో షాక్ తిన్న తెలుగుదేశం శ్రేణులకు పవన్ కల్యాన్ ప్రకటన తో బూస్ట్ వచ్చినట్లయ్యింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేయడంతో రెండు పార్టీల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తున్నది. దీంతో అధికార పార్టీ వైసీపీలో వణుకు మొదలైంది.
    పశ్చిమ గోదావరిలోని ఒక పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ–జనసేన కూటమి క్లీన్‌ స్వీప్‌ చేయనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు వుంది. ఇక్కడ ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే ఆ పార్టీదే అధికారం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లోనూ అదే విషయం వెల్లడైంది. టీడీపీతోపాటు జనసేన కూడా గత ఎన్నికల్లో పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చింది. నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ నుంచి పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామరాజు విజయం సాధించగా, నరసాపురం, భీమవరం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెంలలో వైసీపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో జగన్‌ పార్టీ ఈ సీట్లు సాధించింది. అదే ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగితే ఈ ఏడు స్థానాలు, నరసాపురం పార్లమెంట్‌ స్థానంతో సహా టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశం ఉండేది. గత ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ అభ్యర్థికి 71,048 ఓట్లు వస్తే టీడీపీకి 53,788, జనసేనకు 61,951 ఓట్లు లభించాయి. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు లెక్కిస్తే లక్షా 15 వేల 739. నరసాపురంలో వైసీపీకి 54,861 ఓట్లు లభించాయి. టీడీపీకి 26,905, జనసేనకు 48,892 వచ్చాయి. ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు 75,797. తణుకులో వైసీపీకి 75,133 ఓట్లు రాగా, టీడీపీకి 73,276, జనసేనకు 31,796 ఓట్లు లభించాయి. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు 1,05,075. తాడేపల్లిగూడెంలో వైసీపీకి 70,078 ఓట్లు రాగా, టీడీపీకి 54,028, జనసేనకు 35,796 వచ్చాయి. వెరసి ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు 90,004. ఆచంటలో వైసీపీకి 66,013 ఓట్లు రాగా, టీడీపీకి 53,366 జనసేనకు 13,943 వచ్చాయి. ఈ రెండు పార్టీలకు కలిపి మొత్తం 67,309 వచ్చాయి. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చిన ఓట్లు కలిపితే వైసీపీకి తక్కువగానే వచ్చాయి. గత ఎన్నికల్లోనే కలిసి పోటీ చేస్తే మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసేది. ఈ సారి పొత్తు పొడవడంతో క్లీన్‌ స్వీప్‌ ఖాయమని ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం, జనసేనలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయాలని సాధారణ ప్రజానీకం ఆశిస్తున్నది. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో ఆ పార్టీ శ్రేణులు పోరుబాట పట్టాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర జిల్లాలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఇది కేడర్‌లో మరింత ఉత్సాహం నింపింది. చంద్రబాబు అరెస్ట్‌ కాకపోయి ఉంటే ఈ పాటికే ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతూ ఉండేది. కాని అరెస్ట్‌ తో ఉలికిపాటుకు గురై అయోమయంలో పడ్డారు. అంతలోనే తేరుకున్నారు. పవన్ కల్యాణ్  టీడీపీకి సంఘీభావం తెలిపారు. జిల్లాలోనూ జనసేన శ్రేణులు తెలుగుదేశంతో కలసి పోరుబాట పట్టి బంద్‌ పాటించాయి. తాజాగా పొత్తుపై అధినేతల నుంచే స్పష్టమైన ప్రకటనలు వెలువడడంతో రెండు పార్టీల్లోనూ ఉత్సాహం రెట్టింపైంది. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక ఫలితాలు తరువాయి అంటూ సంబరపడుతున్నాయి.
    వైసీపీలో వణుకు
    పొత్తుపై టీడీపీ, జనసేనల సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పవన్‌ కల్యాణ్‌పైనా, పొత్తుపైనా ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక సామాజిక వర్గాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారంటూ రుసరుసలాడుతున్నారు. వాస్తవానికి జనసేన ఒంటరిగా పోటీ చేయాలంటూ తొలి నుంచి జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరు పార్టీలు కలిసి వస్తే ఓటమి ఖాయమని గత గణాంకాలను విశ్లేషిస్తున్నారు. రకరకాల కుయుక్తులతో అటు పవన్‌ను, ఇటు చంద్రబాబును దుర్భాషలాడుతున్నారు. కాని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రెండు పార్టీలు కలిస్తే జిల్లాలో ఒక బలీయమైన శక్తిగా అవతరించనున్నాయి. రెండు పార్టీలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అది రుజువైంది. మొత్తంగా రెండు పార్టీల కలయిక వైసీపీకి మింగుడు పడడం లేదు. ఆ పార్టీ నేతలు బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. లోలోపల ఓటమి భయం వారిలో వెంటాడుతోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో రెండు పార్టీల కలయికతో అనూహ్య ఫలితాలు రానున్నాయని ఆశిస్తున్నారు.
    ఇప్పుడే మొదలైన పందేలు..
    పశ్చిమ గోదావరి పందేలకు పెట్టింది పేరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన పొత్తుతో వస్తే మొత్తం ఏడు స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఇప్పటికే అంచనాకు వచ్చారు. వైసీపీకి ఘోర ఓటమి తప్పదని అంచనా భావిస్తున్నారు. ఆ దిశగా పందేలు వేసేందుకు తగిన వ్యూహాలు వేస్తున్నట్టు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...