32.6 C
India
Tuesday, May 7, 2024
More

    The Largest Army : అత్యధిక సైన్యమున్న దేశాలు ఇవే తెలుసా..?

    Date:

    The Largest Army
    The Largest Army

    The Largest Army : ఏదేశానికైనా సొంత సైన్యం ఉంటుంది. తమ దేశ సరిహద్దులను కాపాడుకోవడంతో పాటు భౌగోళికంగా, అంతర్గతంగా ఎలాంటి ఇబ్బందులు ఎధురైన రక్షణకు దేశాలు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. శత్రుదేశాల నుంచి ముప్పు ను ఎదుర్కొవడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాలు సైనిక, రక్షణ రంగాలు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అత్యధిక సైన్యమున్న టాప్ టెన్ దేశాల గురించి మనం తెలుసుకుందాం.

    1. చైనా
    ప్రస్తుతం అత్యధిక సైన్యమున్న దేశంగా చైనా ఉంది. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే ఆయుధ సంపత్తి కూడా చైనా సొంతం. ఏటా పెద్ద మొత్తంలో నిధులను చైన తన సైనిక బలగాన్ని పెంచుకోవడంతో పాటు రక్షణపరమైన అంశాలకు కేటాయిస్తుంది. శత్రు దుర్భేద్య దేశంగా చైనాకు పేరుంది. శత్రువు చైనాలోకి అడుగు పెట్టాలంటనే వణుకు పుట్టేలా అక్కడి  ఆర్మీ ఉంటుంది. మొత్తంగా సుమారు 20 లక్షల సైన్యం ఆ దేశానికి ఉంది.

    2. ఇండియా
    చైనా తర్వాత అధిక సైన్యమున్న దేశంగా భారత్ ఉంది. సుమారు 14. 5 లక్షల సైన్యం ఇండియా వద్ద ఉంది. ప్రస్తుతం ఇండియా కూడా ఆయుధ సంపత్తి కూడా పెంచుకుంటున్నది. పొరుగు దేశాలు ఇప్పటికే ఇండియాపై కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో భారతదేశం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది.

    3. యూఎస్ఏ
    ఇక సైన్య బలగం పరంగా యూఎస్ఏ మూడో స్థానంలో ఉంది. కానీ ఆయుధాల విషయంలో మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. యూఎస్ఏ ప్రస్తుత సైన్యం 13.9 లక్షలుగా ఉంది. కానీ అమెరికా వద్ద అత్యాధునిక వెపన్లు, యుద్ధ విమనాలు, రాడార్లు అందుబాటులో ఉన్నాయి.

    4.  ఉత్తర కొరియా
    చిన్న దేశమే అయినా ఉత్తర కొరియా అగ్రదేశాలను వణికిస్తున్నది ప్రస్తుతం 12 లక్షల సైన్యం ఆదేశం సొంతం.  ఇక్కడ నియంతలా వ్యవహరించే కిమ్ ఎన్నో దేశాలకు తన సవాల్ విసురుతుంటాడు. జనాభా కూడా తక్కువే ఉన్నా సైన్యాన్ని మాత్రం పెద్ద ఎత్తున సిద్ధం చేసుకున్నాడు.

    5. రష్యా
    పెద్ద దేశాల జాబితాలో ఉన్న చైనా వద్ద మాత్రం 8.3 లక్షల సైన్యం మాత్రమే ఉంది. అత్యాధునిక ఆయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. అయినా ప్రస్తుతం ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో చైనా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నది.

    6. పాకిస్థాన్
    భారత్ కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్ వద్ద కేవలం 6.5 లక్షల సైన్యం మాత్రమే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ దేశం ఎదురు చూస్తూ ఉంటుంది.

    7. ఇరాన్
    ఇరాన్ వద్ద 5.7 లక్షల సైన్యం ఉంది. ప్రస్తుతం అక్కడ కూడా సైన్యాన్ని పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

    ఇక చివరగా దక్షిణ కొరియా వద్ద 5.5 లక్షలు,  వియత్నాం వద్ద 4.7 లక్షలు, ఈజిప్టు వద్ద 4.4 లక్షల సైన్యం ఉంది. ప్రపంచంలో అత్యధిక సైన్యమున్న టాప్ టెన్ దేశాలు ఇవే.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Agni Veer scheme : అగ్ని వీర్ స్కీమ్ లో అవసరమైతే మార్పులు చేస్తాం.. రాజ్నాథ్ సింగ్

    Agni Veer Scheme : భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్ని...

    Sachin Tendulkar : కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

    Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్...

    Nehru : నెహ్రూ కి జలకిచ్చిన మన గొప్ప సైనికుడు

    Nehru : 1948 అప్పటి తాత్కాలిక ప్రధాని నెహ్రూగారు మిలిటరీ అధికారులను ఉద్దేశించి,...

    Operation ‘Pakistan’ : ఆపరేషన్ ‘పాకిస్తాన్’.. ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం

    Operation 'Pakistan' : భారత్‌పై పాకిస్తాన్  కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. చొరబాటుకు సరైన...