Vijay Devarakonda :
మాస్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికి తెలిసిందే. అతడి స్టైల్ భిన్నంగా ఉంటుంది. వేసుకునే డ్రస్, ధరించే చెప్పులు, ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువే. సినిమాలు కూడా అలాగే ఉంటాయి. నువ్విలా సినిమాతో తెరంగేట్రం చేసిన విజయ్ పెళ్లి చూపులు సినిమాతో క్లిక్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారాడు.
ఏ సినిమా అయినా రొటీన్ కు భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎదిగాడు. లైగర్ సినిమా నిరుత్సాహపరచినా వెనుదిరగలేదు. ప్రస్తుతం తమ్ముడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బేబి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టాడు. మంచి హిట్ అందుకున్న సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా ఓ అభిమాని స్టేజీ పైకి ఎక్కి అతడి పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. దీనికి దూరంగా జరిగినా ఆ అభిమాని మాత్రం ఆగలేదు. దీంతో పోలీసులు వచ్చి అతడిని పట్టుకున్నారు. విజయ్ నే పరుగెత్తించిన అభిమాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాదాలపై పడకుండా విజయ్ పక్కకు పరుగెత్తాడు.
అన్నదమ్ములిద్దరు విజయాలతో దూసుకుపోతుండటంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండ కూడా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న సినిమా అయినా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో దీని సక్సెస్ మీట్ కు హాజరయిన విజయ్ కి ఈ చేదు అనుభవం ఎదురైంది.