Vijay Sethupathi : గత చిత్రాల్లో తండ్రులతో హీరోయిన్ గా చేసిన వారు కొడుకులతో కూడా జతకట్టేశారు. దానికి ఎలాంటి మొహమాటం చూపలేదు. అది ఓ నటన మాత్రమే అని సరిపెట్టుకున్నారు. అలనాటి ప్రముఖ తార శ్రీదేవి నాగేశ్వర్ రావుతో నటించింది. నాగార్జునతో కూడా రెండు సినిమాలు చేసింది. కాజల్ ఇటు రాంచరణ్ తో హీరోయిన్ గా చేసింది. తరువాత చిరుతో ఖైదీ నెంబర్ 150లో జత కట్టింది.
సినిమాల్లో అవేమీ పట్టించుకోరు. అది కేవలం నటన మాత్రమే. కానీ ఇక్కడ ప్రముఖ తమిళ నటుడు విజయ్ మాత్రం ఇందుకు నో చెప్పాడు. తమిళ ఉప్పెన సినిమాలో విజయ్ కు క్రతిశెట్టి కూతురుగా నటించింది. తరువాత సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారట. కానీ విజయ్ సేతుపతి దానికి నో చెప్పాడట. తనతో కూతురుగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయలేనని చెప్పాడట.
తనకు కూడా అంతటి వయసున్న అమ్మాయి ఉంది. ఉప్పెనలో నటించేటప్పుడు నువ్వు నా కూతురు లాంటి దానికి భయపడకుండా చేయమని ఆ అమ్మాయికి చెప్పాను. దీంతో నా కూతురును ఆమెలో చూశారు. ఇప్పుడు ఆమెలో రొమాంటిక్ యాంగిల్ చూడలేను. ఆ అమ్మాయితో నటించలేనని చెప్పాడట. దీంతో ఆమెను మార్చి మరో హీరోయిన్ ను పెట్టారట.
నిజంగా ఓ తండ్రిలా ఫీలై ఆమెతో నటించాను. ఇప్పుడు లవర్ గా చేయలేనని తెగేసి చెప్పాడట. నిజంగా ఆమెను తన కూతురులా భావించానని చెప్పాడు. అందుకే ఆమెను హీరోయిన్ గా వద్దని చెప్పేశాడట. దీంతో ఆమె స్థానలో వేరే అమ్మాయిని తీసుకున్నారని తెలుస్తోంది. అలా విజయ్ అంతటి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇ్పటికి కూడా అంత గొప్ప హీరోగా మనగలుగుతున్నాడు.