34.2 C
India
Tuesday, May 7, 2024
More

    TDP : యువగళం ఒక మైలురాయి.. ఎన్నో పాఠాలు.. ఎన్నో అనుభవాలు

    Date:

    TDP
    TDP

    TDP : టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిగా, పార్టీ యువనేతగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఆయన ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. 4వేల కిలోమీటర్ల లక్ష్యంతో జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన ఈ యువగళం పాదయాత్ర నేటికి 189 రోజులకు చేరింది. మొత్తంగా 2500 కిలోమీర్ల యాత్ర పూర్తయ్యింది. మరో 1500 కిలోమీటర్లు మిగిలి ఉంది. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా. ఎక్కడా వెనక్కి తగ్గకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నిండుటెండల్లోనూ, భారీ వర్షంలోనూ ఆయన పాదయాత్ర కొనసాగింది.

    అయితే ఈ పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలను ప్రజల్లో వారికిదగ్గరై లోకేశ్ తెలుసుకున్నట్లు ఆయన మాటలను బట్టి కనిపిస్తున్నది. ఇలా ఎన్నో కుటుంబాలను కూడా పాదయాత్రలో భాగంగా లోకేశ్ ఆదుకున్నారు. వారికి భవిష్యత్ పై భరోసానిస్తూ ముందుకు సాగారు. అలసినా, కొంత ఇబ్బంది పడినా ఎక్కడా ఆయన చిరునవ్వు వీడలేదు.  లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతూ అదే దరహాసంతో నడిచారు. విజయవాడ నియోజకవర్గంలో ఆయన పర్యటన అట్టహాసంగా సాగింది. పేదలకు 20 వేల ఇండ్లు నిరి్మించి ఇస్తామని నారా లోకేశ్ హామీనిచ్చారు.

    తాను మంగళగిరిలో ఓడిపోవడం వల్లే ఇంత పట్టుదలతో శ్రమిస్తున్నానని, ఇది తనకు ఓ పాఠం నేర్పిందచని చెప్పారు. మరింత కసితో పనిచేసే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఈసారి కూడా మంగళగిరి నుంచే బరిలోకి దిగుతానని, కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతానని చెప్పుకొచ్చారు. అయితే నాటికి నేటికి లోకేశ్ లో ఎంతో మార్పు కనిపిస్తున్నదని నేతలు చెబుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఉండవల్లి లో ప్రజావేదిక వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్.. ఇది జగన్ విధ్వంస పాలనకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. వైసీపీ ఆరాచకానికి ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీపై లోకేశ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏదేమైనా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన లోకేశ్ నాటి నుంచి వారి మధ్యే గడుపతున్నారు. వారిలో ఒకడై సాగుతున్నాడు. కష్టనష్టాల్లో నేనుంటా అంటూ పలకరిస్తున్నాడు.

    నాడు ఒక్క చాన్స్ అంటూ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కసారి కూడా ఈ ఐదేళ్లలో జనంలోకి నేరుగా వెళ్లలేదు. కేవలం వలంటీర్లను పట్టుకొని తన పని కానిచ్చేస్తున్నారు. కానీ లోకేశ్ మాత్రం ఓడినా ప్రజల్లోనే ఉన్నారు. వారు పెట్టిందే తిన్నారు. అందరివాడై నడుస్తున్నాడు. నాడు లోకేశ్ కు రాజకీయమే చేతకాదు అని నిందించిన వారు కూడా ముక్కున వేలేసుకునేలా ఈ రోజు ఆయనలో మార్పును చూశామంటూ కీర్తిస్తున్నారు. లోకేశ్ ఈ తరానికి సరిపోయే నాయకుడు అంటూ కొనియాడుతున్నారు. యువగళం పాదయాత్ర విజయవంతమైనట్లే అనే అభిప్రాయం శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తుందంటే 2024లో మార్పు దగ్గర్లో ఉందనే అభిప్రాయం కూడా వారిలో కనిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...