ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుండి గుజరాత్ లో పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా ఈరోజు మాత్రం 89 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత 24 ఏళ్లుగా గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దాంతో సహజంగానే కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంటుంది.
ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ, అలాగే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రయత్నాలే చేసాయి. అయితే వాళ్ళ ప్రయత్నాలు సఫలం అయ్యాయా ? లేదా ? అన్నది కౌంటింగ్ రోజున తెలియనుంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం మోడీ – షా ద్వయానికి కీలకం ఎందుకంటే గుజరాత్ వాళ్ళ సొంత రాష్ట్రం కాబట్టి. పైగా 2024 లో లోక్ సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇవి సెమీ ఫైనల్ లాంటివి మరి.