సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించింది భారత పార్లమెంట్. 1989 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు కృష్ణ. లోక్ సభ సభ్యుడిగా రెండేళ్ల పాటు సేవలు అందించారు. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాల సమ్మేళనం కావడంతో వీపీ సింగ్ , చంద్రశేఖర్ ప్రభుత్వాలు వెంటనే కుప్పకూలాయి. దాంతో భారత్ లో 1991 లో లోక్ సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో మళ్ళీ ఏలూరు నుండి పోటీ చేశారు కృష్ణ. అయితే అప్పట్లో కృష్ణ ఓటమి చవి చూసారు. లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రచారంలో ఉన్న రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో చలించిపోయిన కృష్ణ ఇక క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమయ్యాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఇటీవల కాలంలో మరణించిన మాజీ లోక్ సభ సభ్యులకు నివాళి అర్పించారు. ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకుడు , కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు . కృష్ణ సినిమా హీరోగానే కాకుండా 1989 లో లోక్ సభ సభ్యుడిగా సేవలు అందించారు కాబట్టి ఆయన సేవలను శ్లాఘించారు.