తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసాడు. BRS కు చెందిన 25 మంది ఎమ్మెల్యే లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని , వాళ్ళను మారిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా 100 సీట్లు గెలుచుకుంటామని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు. రాజకీయ వర్గాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
తెలంగాణ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పూర్తి నమ్మకం ఉందని , అయితే మా ఎమ్మెల్యేలలో కనీసం 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వాళ్ళను మార్చకపోతే 90 సీట్లు గెలుస్తాం ……. మార్చితే 100 సీట్లు గెలుస్తాం అంటూ వ్యాఖ్యానించాడు. ఎర్రబెల్లి వ్యాఖ్యలతో కొంతమంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ మొదలైంది అప్పుడే. నేను చేసిన సర్వే ప్రకారం ఇది తేలిందని , నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని అంటున్నాడు ఎర్రబెల్లి.