
Horoscope Today: మేష రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది.
వ్రషభ రాశి వారికి శ్రమ పెరిగినా ఫలితాలుంటాయి. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథన రాశి వారికి శుభ వార్త వింటారు. అధికారులు మీకు మద్దతు ఇస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శివుడిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి వారికి ఆశించిన పనుల్లో పురోగతి ఉంటుంది. శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. గణపతి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి. విష్ణు సందర్శనం శుభం కలిగిస్తుంది.
తుల రాశి వారికి పట్టుదలతో పనులు చక్కబెడతారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. అంటీ ముట్టనట్లు ఉంటే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే బాగుంటుంది.
వ్రశ్చిక రాశి వారికి మంచికాలం. పెద్దల మద్దతు ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదేవతను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ధనస్సు రాశి వారికి శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పనుల్లో పురోగతి ఉంటుంది. శివ స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.
మకర రాశి వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మనోబలం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. సూర్యారాధన చేయడం మంచిది.
కుంభ రాశి వారికి పనులు పూర్తి చేసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రశంసలు పొందుతారు. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. బంధు మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్రధ్యానం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి.