సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12. దాంతో తన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. ఇక ఇదే సమయంలో తన మనవళ్లతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు రజనీకాంత్. ఇద్దరు మనవళ్లు తాతయ్య తో సరదాగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాట రజనీకాంత్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.