నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడు చిత్రాలు రాగా మూడు కూడా ……. సింహా , లెజెండ్ , అఖండ చిత్రాలు అఖండమైన విజయాన్ని అందుకున్నాయి. దాంతో బాలయ్య ను మాస్ ప్రేక్షకులను అలరించేలా చూపించాలంటే ఒకప్పుడు కోడిరామకృష్ణ , ఏ. కోదండరామిరెడ్డి , బి. గోపాల్ ల తర్వాత బోయపాటి శ్రీను సరైనోడు అంటూ నిర్మాతలు లెక్కలు వేసుకుంటున్నారు.
బాలయ్య స్లంప్ లో ఉన్న ప్రతీ సమయంలో బోయపాటి శ్రీను తో చేసిన సినిమా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది. సింహా , లెజెండ్ , అలాగే అఖండ చిత్రాలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ముచ్చటగా మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబినేషన్ లో రాబోయే నాలుగో సినిమా కోసం ఏకంగా నలుగురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. అఖండ చిత్రాన్ని నిర్మించిన ద్వారకా క్రియేషన్స్ రవీందర్ రెడ్డి , 14 రీల్స్ అధినేతలు ఆచంట గోపీనాథ్ , ఆచంట రామ్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ లతో పాటుగా విరాటపర్వం చిత్రాన్ని నిర్మించిన చెరుకూరి సుధాకర్ కూడా పోటీ పడుతున్నాడు.
మొత్తానికి బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాలుగో సినిమా రావడం పక్కా అయ్యింది. కాకపోతే ఆ సినిమాను నిర్మించేది ఎవరు ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ను దక్కించుకోవడానికి చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు కానీ వాళ్లలో ఎవరికి ఈ కాంబినేషన్ దక్కుతుందో చూడాలి. బాలయ్య ను ఎలా చూపించాలో బోయపాటి కి బాగా తెలుసు కాబట్టి మరో బ్లాక్ బస్టర్ ఖాయం అనే మాట వినబడుతోంది.