నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా డార్లింగ్ ప్రభాస్ తో ఆహా కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ తో పాటుగా మరో హీరో గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. బాహుబలి ఇంటర్వ్యూ కాబట్టి ఎదురు చూసే ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గ్లింప్స్ ను ఈరోజు విడుదల చేయడానికి ఆహా టీమ్ సన్నాహాలు చేస్తోంది.
బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తుంటే వాటికి డార్లింగ్ ప్రభాస్ , అలాగే గోపీచంద్ సమాధానాలు ఇస్తుంటే …… అవి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో అతడి కోసం ఈగర్ గా వెయిట్ చేసే ప్రేక్షకులు కోట్లాది మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో చెప్పడానికి ట్రయల్ గా స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇక పూర్తి ఎపిసోడ్ కొత్త ఏడాది సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ బాహుబలి ఎపిసోడ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. బాలయ్య – ప్రభాస్ ల ఇంటర్వ్యూ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బాహుబలితో బాలయ్య ఇంటర్వ్యూ చేసాడు అని తెలుసుకొని సంతోషపడుతున్నారు. ఈ ఎపిసోడ్ లోనైనా ప్రభాస్ పెళ్లి గురించి చెబుతాడా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య ప్రభాస్ నుండి సమాధానం రాబట్టాడా ? లేదా ? అన్నది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు.