షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ” పఠాన్ ”. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసారు. భారీ యాక్షన్ విజువల్స్ తో ఉన్న పఠాన్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. షారుఖ్ ఖాన్ తో పాటుగా దీపికా పదుకోన్ జాన్ అబ్రహం నటించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. తీవ్ర వివాదం సృష్టించిన ఈ చిత్రం జనవరి 25 న భారీ ఎత్తున విడుదల కానుంది.
దీపికా పదుకోన్ రెచ్చి పోయి టు పీస్ బికినీలో వీరంగం వేసింది. దాంతో ఆ బికినీ తాలూకు సన్నివేశాలను కట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే బాయ్ కాట్ పఠాన్ అంటూ ట్రెండింగ్ అయ్యింది. ఇక షారుఖ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు ట్రోలర్స్ కు. దాంతో కొంతవరకు సద్దుమణిగింది ఆ వ్యవహారం.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే …… పక్కా కమర్షియల్ ఫిలిం అని అర్థమౌతోంది. భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. చాలాకాలం తర్వాత షారుఖ్ నటించిన సినిమా కావడంతో కింగ్ ఖాన్ అభిమానులు పఠాన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.