
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన 30 వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ కావడంతో ఎన్టీఆర్ – కొరటాల సినిమా కూడా గ్లోబల్ లెవల్లో విడుదల కానుంది. దాంతో ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు విలన్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ , బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ , తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇలా ఈ ముగ్గురిని ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్లుగా చూపించాలనే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు సమఉజ్జీలను పెడితేనే బాగుంటుంది. అందుకే దిగ్గజాలు అయిన విక్రమ్ , సైఫ్ అలీఖాన్ , విజయ్ సేతుపతి లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు ఓకె అయినా సినిమాకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. విక్రమ్ తమిళ్ లో పెద్ద హీరో అనే విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది ఈ హీరోకు. అలాగే సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ హీరో. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక విజయ్ సేతుపతి విషయానికి వస్తే ……. విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. హీరోగా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని పాత్రలను పోషిస్తున్నాడు.
ఎన్టీఆర్ – కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. అసలు గత ఏడాది లోనే షూటింగ్ మొదలు కావాలి. కానీ ఆచార్య అట్టర్ ప్లాప్ కావడంతో ఈ సినిమా స్క్రిప్ట్ లో రకరకాల మార్పులు చేశారు. అందువల్ల ఆలస్యం అవుతోంది. ఈనెలలో ప్రారంభించి మార్చి నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ 2024 ఏప్రిల్ 5 న విడుదల చేస్తామని మాత్రం ప్రకటించారు.