నువ్వు శ్రీదేవి అయితే నేను చిరు అవుతానంటూ అందాల భామ శ్రుతి హాసన్ తో సయ్యాట ఆడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య కోసం యూరప్ వెళ్ళాడు మెగాస్టార్ చిరంజీవి. యూరప్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – శ్రుతి హసన్ ల పై పాట చిత్రీకరిస్తున్నారు. ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు తన కుటుంబంతో కలిసి విహార యాత్ర కూడా చేస్తున్నాదు మెగాస్టార్.
ప్రియురాలితో విరహ యాత్ర కుటుంబంతో విహార యాత్ర అన్నమాట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2023 జనవరి 13 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. బ్యాలెన్స్ గా ఉన్మ రెండు పాటలను యూరప్ లో చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మాస్ మహరాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.