Prabhas – Project K ప్రభాస్ హీరోగా మరో పాన్ ఇండియా స్థాయి మూవీ వస్తోంది. ప్రాజెక్టు కె గా చెబుతున్న ఇది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా కుదరడం లేదు అంటున్నారు. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2500 ఏళ్ల నాటిదని అంటున్నారు. ఇందులో కీలక పాత్రలు ఉంటాయని చెబుతున్నారు. మహాభారతం కాలం నాటి సినిమాగా అభివర్ణిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ విష్ణువుగా కనిపిస్తాడట. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. కమల్ హాసన్ విలన్ గా చేయబోతున్నాడట. దీని కోసం కమల్ రూ. 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇలా సినిమా మొత్తం సంచలనంగానే ఉండబోతోంది. దీపికా పడుకునే హారోయిన్. ఆమెను కాపాడే పాత్రలో ప్రబాస్ నటిస్తున్నాడు. మొత్తానికి ప్రాజెక్టు కె సంచలనాలు క్రియేట్ చేస్తుందో ఏమో తెలియడం లేదు.
ఆదిపురుష్ అపజయంతో ఉన్న ప్రభాస్ కు ఈ సినిమా మంచి ఊపునిస్తుందని అనుకుంటున్నారు. ప్రాజెక్టు కె అంటే ప్రాజెక్టు కర్మ, ప్రాజెక్టు కల్కి అనే పేర్లు పరిశీలిస్తున్నారట. ప్రాజెక్టు కాలచక్ర చివరికి ఫైనల్ అయినట్లు సమాచారం. దీంతో సినిమాకు విడుదలకు ముందే మార్కెట్ చేస్తోంది. దీనికి రూ. 400 కోట్ల వ్యయం అవుతోందని చెబుతున్నారు. కానీ ఇప్పటికే రాయలసీమ, నైజాం హక్కులకు వందల కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా ప్రభాస్ సినిమా వండర్ క్రియేట్ చేస్తుందా? లేక గత చిత్రాల మాదిరి డీలా పడుతుందా అనేదే సమస్య. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కె మంచి రికార్డు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. పాత్రల ఎంపికలో కూడా సీనియర్ నటులే ఉన్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి మహామహులు ఉండటమే దీనికి కారణం. మరోవైపు దీపికా పడుకునే కూడా హీరోయిన్ గా చేయడం గమనార్హం.