32.2 C
India
Thursday, May 9, 2024
More

    Kavitha : కవిత ప్లాన్ అదేనా..? అర్వింద్ ఓటమి ఖాయమా..?

    Date:

    Kavitha
    Kavitha

    Kavitha : కల్వకుంట్ల కవిత.. కేసీఆర్ బిడ్డగానే కాకుండా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావశీల మహిళ.. మంచి వాగ్ధాటితో రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నది. ఇటీవల మద్యం స్కాం ఆరోపణలు చుట్టుముట్టినా, వాటి నుంచి బయటపడగలిగారు. నవ్వుతూనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని ధీమాతో అడుగులు వేసి, బయటకు రాగలిగారు.

    అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. నాటి నుంచి ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వస్తున్నది. ఇక అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతానని కవిత గతంలో ప్రకటించారు. ఆయన దేశంలో ఎక్కడ పోటీ చేసినా, అక్కడికి వెళ్లి మరి ఓడిస్తానని ప్రకటించారు. తాను చివరి వరకు నిజామాబాద్ లోనే ఉంటానని, ఇక్కడి ప్రజలతోనే ఉంటానని ప్రకటించారు.

    ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లకీ పోటీ చేస్తారని, కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. అయితే అర్వింద్ ను ఓడించడానికి ఇప్పటికే పక్కా వ్యూహంతో కవితక్క ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల నిజామాబాద్ లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. అర్వింద్ ఓటమే లక్ష్యంగా ఆమె పక్కా ప్రణాళిక మేరకు దిగుతున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా అదేస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇది ఎటు దారితీస్తుందో తెలియడం లేదు. అలా అని అర్వింద్ మీద కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం ఏం లేదు. పసుపుబోర్డు హామీతో గత ఎన్నికల్లో లాభపడ్డా, ఈసారి ఆయనపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తున్నది. పసుపు బోర్డు హామీ మరిచిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరులో కాంగ్రెస్ లాభపడే  అవకాశముందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...