Walking : నడక వల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె జబ్బుల ముప్పు రాకుండా ఉంటుంది. దీంతో ఆరోగ్యంపై మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మనకు గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. రోజు నడవడం వల్ల గుండెకు రక్తం పంపించే రక్తనాళాలు సజావుగా పనిచేస్తాయి. రక్తసరఫరా మెరుగుగా ఉంటుంది. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి? ఎంత దూరం నడవాలి? అనేదానిపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 4 వేల అడుగులు నడిస్తే సరిపోతుంది. కనీసం 2,337 కు పైగా అడుగులు వేసినా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మనం రోజు నడక సాగించడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. ఉదయం నడక ఎంతో మంచిది. దివ్య ఔషధం లాంటిది. సాయంత్రం భోజనం చేశాక కూడా ఓ గంట పాటు నడిస్తే ఎంతో ఉత్తమం. దీంతో మనకు చావు ముప్పు నుంచి తప్పించుకున్న వాళ్లం అవుతాం.
పలు దేశాల్లో 2,27,000 మందిపై జరిపిన పరిశోధనలో ఓ ఆసక్తికర విషయం బయట పడింది. వారి ఆరోగ్యం మెరుగుగా తయారయింది. కేవలం వారు నడవడం వల్లే వారికి ఆరోగ్యం సిద్ధించింది. ఇలా నడక వల్ల మన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. నడక వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలిసినా నిర్లక్ష్యమే. నడవడానికి బద్దకంగా మారుతున్నారు. దీంతో రోగాలకు దగ్గరవుతున్నారు.
రోజు ఉదయం, సాయంత్రం నడక సాగిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నడక వల్ల మన బీపీ అదుపులో ఉంటుంది. షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది. నడక వల్ల దాదాపు 25 రకాల రోగాలు రాకుండా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఇలా నడక వల్ల మనకు చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుసుకుని అందరు నడక కొనసాగిస్తే ఎంతో మేలు కలుగుతుంది.