Health మన ఆరోగ్యం బాగుండాలంటే సరైన సమయంలో భోజనం చేయాలి. లేకపోతే శరీరం సహకరించదు. రోగాలు దరిచేరడం ఖాయం. రాత్రి భోజనం చేయకపోతే పోషకాల లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరం పలు వ్యాధులకు లోనవుతుంది. మనకు శక్తి రావాలంటే భోజనం ఒక్కటే మార్గం. అది కూడా పోషకాలతో నిండి ఉండాలి. అన్నం తింటే అందులో కార్బొహైడ్రేడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో శరీరానికి శక్తి వస్తుంది కానీ ప్రొటీన్లు మాత్రం అందవు.
మనిషి రోజుకు మూడు సార్లు తింటుంటాడు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేస్తుంటాడు. పని బిజీలో పడి కొందరు అల్పాహారం మానేస్తుంటారు. మరికొందరు డిన్నర్ వదిలేస్తుంటారు. దీని వల్ల మనకు నష్టాలే ఉంటాయి. మనం సరైన సమయంలో భోజనం చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చి చేరడం ఖాయం.
మన శరీరాన్ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావు. దీనికి గాను మన ఆహారంలో బలమైనవి ఉండేలా చూసుకోవడం మంచిది. రాత్రి సమయంలో ఆహారం తీసుకోకపోతే శక్తి నశిస్తుంది. అర్థరాత్రి సమయంలో ఆకలి వేస్తుంది. నిద్ర సరిగా పట్టదు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.
మనం ఆహారం తీసుకుంటేనే రక్తహీనత సమస్య ఉండదు. రక్తహీనతను దూరం చేసుకోవాలంటే మనం ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రాత్రి 8 గంటల లోపు ఆహారం తీసుకోకపోతే అనర్థాలు వస్తాయి. డిన్నర్ చేయడం వదిలేస్తే మన అనారోగ్యాన్ని మనమే కొనితెచ్చుకున్నట్లు. ఆహారం తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మనకే నష్టం కలుగుతుంది.