Heroine Talk : ఓ భారీ ప్రాజెక్టులోకి ఒక హీరోయిన్ రావడం (పేరును చూచించడం లేదు) టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాను కూడా ఆమె ఎలా దక్కించుకుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ముందుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత హీరో మరో పేరును సూచిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉందంటే.
వాస్తవానికి ఈ సినిమాలో మొదట మరో జాతీయ అవార్డు గ్రహీత నటిని అనుకున్నారు, కానీ ఆ తర్వాతఆమె డేట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. గొప్ప నటి అయిన ఈ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని దర్శక, నిర్మాతలపై హీరో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ఓ సినిమా చేసినప్పుడు ఇద్దరూ బాగా దగ్గరయ్యారని, కానీ కొన్నాళ్ల తర్వాత అన్ని బంధాలను తెంచుకున్నారని అంటున్నారు. ఈ హీరో మరో హీరోయిన్ తో సాన్నిహిత్యం గురించి పుకార్లు పుట్టుకొస్తున్న తరుణంలో ఈ హీరోయిన్ ను సినిమాలోకి నెట్టడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు ఈ టాలెంటెడ్ హీరోయిన్ బిజినెస్ లెవల్ లో సినిమాకు ఊపునిచ్చే కమర్షియల్ ఈక్వేషన్స్ నిర్మాతలు వర్కవుట్ చేసిన తర్వాతే సినిమాలో భాగమవుతారని కొన్ని వర్గాలు అంటున్నాయి. అసలు నిజానిజాలు ఎవరికీ తెలియకపోయినా హీరోయిన్లతో హీరో సాన్నిహిత్యం గురించిన చర్చ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.