Mega daughter కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. ప్రతీ భామ ఈ కాస్టింగ్ కౌచ్ మీద నిత్యం మాట్లాడుతూ ఈ పేరును సాధారణ ప్రేక్షకులకు కూడా తెలిసేలా చేసారు.. ఇంతకు ముందు కంటే భయం లేకుండా ఈ కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న విషయాలను మీడియా ముందు చెబుతూ షాక్ ఇస్తున్నారు.. మరి తాజాగా మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. చాలా కాలం క్రితమే ఈ చిన్నది గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యి.. ఆ తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
యాంకర్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా అమ్మడి మాటలకూ అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల తోనే ఆగిపోయింది.. అయితే ఈ మధ్య మళ్ళీ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్లు చేసుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
అమ్మాయిల ఇష్టం లేకుండా వాళ్ళ ఇస్టంగానే కమిట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి చర్చ అవసరం లేదు.. ఇక్కడ ఎవ్వరూ కూడా బలవంతం చేయరు.. అమ్మాయిలు వీక్ గా ఉంటేనే సమస్య ఎదురవుతుంది.. వారు స్ట్రాంగ్ గా ఉండాలని నేను చెబుతున్నాను.. అందుకే కాస్టింగ్ కౌచ్ ను అందరు గట్టిగ రిజక్ట్ చేసలంటూ ఈమె చెప్పుకొచ్చింది. అయితే ఈమె కామెంట్స్ పై నువ్వు మెగా డాటర్ వు ఏమైనా చెబుతావ్ అంటూ నెటిజెన్స్ స్పందిస్తున్నారు.